ప్రధాని మోదీని బాగా ఇరుకున పెట్టే సలహా ఒకటి మహారాష్ట్ర బిజెపి నుంచి వచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన బిజెపి రైతునాయకుడు ఈ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే పార్టీ పగ్గాలను మోదీనుంచి లాక్కుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఇవ్వడమే మార్గమని, ఈ విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం లోని వసంతరావ్ నాయక్ సేధీ స్వావలంబన్ మిషన్ (VNSSM) ఛెయిర్మన్ కిశోర్తివారీ చేశారు. కిశోర్ తివారి పార్టీలో బాగా పేరున్న నాయకుడే. అందుకే ఆయనకు క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవి లభించింది.
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో ఉన్న రోజునే తివారి ఈ సూచన చేయడం విశేషం. ప్రధాని డిసెంబర్ 18న ధానే, పూణేలలో మెట్రో రైలు ప్రారంబించేందుకు మహారాష్ట్ర కు వచ్చారు. అదే రోజు తివారి మోదీని మార్చడం గురించి ఆర్ ఎస్ ఎస్ కు విజ్ఞప్తి చేశారు.
మోదీని మార్చాలనే సూచన తో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ నేత మోహన్ భగవ్ కు, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ సురేష్ జోషికి ఒక లేక రాశారు. మోదీ అహంభావతో నోట్ల రద్దు చేయడం, జిఎస్ టి అమలు చేయడం, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచినందునే రాజస్థాన్,ఛత్తీష్ గడ్ లలో బిజెపి వోడిపోయిందిన తివారి పేర్కొన్నారు.
‘‘పార్టీలో ప్రభుత్వంలో తీవ్రవాద,నియంతృత్వ దోరణులు అనుసరించే నేతలు సమాజానికి దేశానికి చాలా ప్రమాదకరం. ఇటువంటిది గతంలో ఒకసారి కనిపించింది. అలాంటి విపత్తు పునరావృతం కాకుండా ఉండేందుకు 2019 ఎన్నికలకోసం మోదీని మార్చి పార్టీ పగ్గాలను గడ్కరీ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది,’’ అని తివారీ లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖ పార్టీలో మోదీ , షా మీద వస్తున్నతిరుగుబాటు దోరణికి చిన్న ఉదాహరణ మాత్రమే.