సెక్రటేరియట్‌లోకి వచ్చిన చిరుతపులి ( ఎక్స్ క్లూజివ్ వీడియో)

రాష్ట్ర పరిపాలన అంతా అక్కడి నుంచే నిర్ణయించబడుతది. మంత్రులు, అధికారులు నిత్యం అక్కడ బిజిబిజిగా గడుపుతారు. చీమ చిటుక్కుమన్న తెలిసిపోయే భద్రత అక్కడ ఉంటుంది. కానీ ఓ చిరుతపులి అందరి కళ్లు కప్పుకొని  సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో సెక్రటేరియట్ 7 వ నంబర్ గేట్ నుంచి లోపలికి వచ్చింది. వెంటనే వేరే గేట్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దాదాపు 100 మంది అటవీ అధికారులు రంగంలోకి దిగారు. కానీ ఇంకా చిరుత ఆచూకి దొరకలేదు. సచివాలయంలోకి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. ఈ ఘటన గుజరాత్ సెక్రటేరియట్ ఆఫీసులో జరిగింది. చిరుత పులి ఎంటరైన వీడియో కింద ఉంది చూడండి.