తమిళనాడు మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కొనసాగుతూనే ఉంది. జస్టిస్ ఆర్ముగస్వామి సమక్షంలో విచారణ జరుగుతోంది. అపోలో హాస్పిటల్ కాలేయ వైద్య నిపుణుడు కేఆర్ పళనిస్వామి, నర్సు ఆయేషా ఇన్వెస్టిగేషన్ కు హాజరయ్యారు. విచారణ సంఘం తరపు న్యాయవాదులు పార్ధ సారధి, నిరంజన్ వీరిని పలు ప్రశ్నలు అడగగా ఇరువురు వాటికి సమాధానాలు తెలిపారు.
అమ్మ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆవిడకి అందించిన చికిత్స గురించి అడిగారు అధికారులు. ఆమెకు స్వీట్స్ ఇవ్వడానికి అనుమతించిన వైద్య అధికారుల గురించి పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. జయలలిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో ఆవిడను నేరుగా ఎవరెవరు కలిశారు అనే ప్రశ్నకు ఇరువురి నుండి అధికారులు సమాధానం తెలుసుకున్నట్టు తెలుస్తోంది.