కర్ణాటకలో బిజెపికి షాక్

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కర్ణాటక ఉప ఎన్నికలలో బిజెపికి  గట్టి షాక్ తగిలింది. 3 లోక్ సభ, 2 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బిజెపి విజయం సాధించింది. నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడియూ కూటమి విజయం సాధించింది.  

కర్ణాటక సీఎం కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రాంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భార్య అనితాకుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09, 137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామం జేడీఎస్‌కు ఎంతగానో కలిసొచ్చింది. రాంనగర్ బీజేపీకి 15,906 మాత్రమే పోలయ్యాయి. లక్షా 9వేలకు పైగా భారీ మెజారిటీని అనితా కుమారస్వామి దక్కించుకోవడంతో జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

బళ్లారి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప విజయం సాధించారు.

మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి శివరామ‌గౌడ గెలిచారు.

జమఖండి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌సిద్దు న్యామగౌడ గెలుపొందారు.

రామనగర అసెంబ్లీ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం సాధించారు.

రామనగర నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనితా కుమారస్వామి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య.

శివమొగ్గ లోక్ సభ స్థానాన్ని బిజెపి గెలిచుకుంది. ఇక్కడ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. 50 వేల ఓట్ల మెజార్టితో ఆయన గెలుపొందారు.

బళ్లారి లోక్ సభ స్థానం బిజెపికి చాలా బలమైనది. కీలకమైన బళ్లారిలో శ్రీరాములు సోదరి శాంత బరిలో దిగగా, కాంగ్రెస్ నుంచి సిద్దరామయ్య  అనుచరుడు ఉగ్రప్ప పోటి చేశారు. జెడిఎస్ సపోర్టు లభించడంతో బళ్లారి నుంచి ఉగ్రప్ప విజయం సాధించారు.

మాండ్య లోక్ సభ స్థానం నుంచి జెడిఎస్ అభ్యర్ధి శివరామ గౌడ విజయం సాధించారు. జమఖండి అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆనంద్ విజయం సాధించారు.

శివమొగ్గ లోక్ సభ స్థానాన్ని బిజెపి గెలిచుకుంది. ఇక్కడ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. 50 వేల ఓట్ల మెజార్టితో ఆయన గెలుపొందారు.