ప్రస్తుతం దేశరాజధాని హస్తిన కేంద్రంగా భారత రెజ్లర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. భారతదేశ ఖ్యాతిని ప్రపంచపటంపై పెట్టిన రెజ్లర్లకు దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొందని మనసున్న ప్రతీఒక్కరూ ఆవేదన చెందుతున్నారు! ఇదే సమయంలో సినీ జనాలు, రాజకీయ నేతలు, తోటి ఒలింపిక్స్ విజేతలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలతో పాటూ యావత్ దేశం రెజ్రర్లకు భాసటా నిలుస్తుంది.
ఈ సమయంలో తమ ఆవేదనను, తమ నిరసనను తీవ్ర రూపం దాల్చాలని ప్రయత్నించిన రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము సాధించిన పతకాలను గంగలో పడేయాలని రెజ్లర్లు నిర్ణయించుకున్నారు. మంగళవారం పతకాలతో రెజ్లర్లు అంతాకలిసి హరిద్వార్ దగ్గరికి రాగా.. రైతు సంఘాల నేతలు వారిని వారించి… తమకు కొంత సమయం ఇస్తే ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. రైతుసంఘాల నేతలపై నమ్మకంతో రెజ్లర్లు కాస్త వెనక్కి తగ్గారు!
ఇదిలా ఉంటే… బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ మాత్రం రెజ్లర్లను మరింత రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… రెజ్లర్లు వారి పతకాలను గంగలో పడేయాలని వెళ్లి, వాటిని పడేయకుండా వాటిని రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ కు ఇచ్చారరు. ఇది వారి నిర్ణయం.. దానికి మనమేం చేయగలం? అని పరిపూర్ణమైన నిర్లక్ష్యంతో వ్యాఖ్యానించారు. దీంతో దేశవ్యాప్తంగా బ్రిజ్ భూషణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.
అయితే ఇంత జరుగుతున్నా… దేశ పతకాన్ని ప్రపంచపటంపై ఎగరేసిన రెజ్లర్ల పరిస్థితి ఇంత దయణీయంగా మారిపోయినా… తమ పార్టీ ఎంపీ ఇంత బరితెగించినట్లుగా ప్రవర్తిస్తున్నా… ప్రపంచం అంతా కొనియాబడబడుతున్నట్లు చెబుతున్న బీజేపీ నేతలతో కొనియాడబడుతున్న మోడీ మాత్రం స్పందించడం లేదు! వీరి ఆవేదన మోడీ హృదయాన్ని తాకలేకపోతుంది.. వీరి ఆక్రందన ప్రధాని చెవులను చేరలేకపోతుంది..! మే బీ మోడీ జీ బిజీ!!
దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. ఇంత బరితెగించి ఒక ఎంపీ ప్రవర్తిస్తుంటే మోడీ ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. విదేశీయాత్రలపై మోడీకున్న శ్రద్ధలో ఒక్కశాతం అయినా రెజ్లర్ల కష్టాలపై పెట్టాలని సూచిస్తున్నారు! మరి నెటిజన్ల కామెంట్లైనా పీఎంఓని చేరతాయోలేదో వేచి చూడాలి! కానిపక్షంలో… 2024 ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు!