నిజం నిప్పులాంటిది..ఎప్పటికైనా బయటపడక మానదు. అది ఎప్పుడు..ఏ పరిస్థితుల్లో బయట పడుతుందో చెప్పలేం. ఇప్పడు మెజార్టీ క్రైమ్స్ జరగడానిక కారణం అక్రమ సంబంధాలు. పచ్చని కాపురాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. ఎంతోమంది ఇతర యువతీయువకుల పరాయి వాళ్ల మోజులో పడి సంపార బంధాల్ని తెంచుకుంటున్నారు. హత్యలు చేస్తూ జైళ్లకు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ మహిళ తన ప్రియుడితో రాసలీలలు చేస్తూ నాటకీయ పరిస్థితుల్లో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో వారిద్దర్నీ కసి తీరా బాదిన అతడు పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
అయితే వారి అక్రమ సంబంధాన్ని బయట పెట్టింది ఓ గొర్రె కావడం ఆశ్చర్యపరిచే విషయం. అవును ఇది నిజంగా ఇంట్రస్టింగ్ స్టోరీనే. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాహుల్, పద్మజ(పేర్లు మార్చాం) భార్యాభర్తలు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. భర్త ఆటో నడుతుండగా.. భార్య గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే అనితకు వివాహానికి ముందే జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. పెళ్లైన తర్వాత కూడా వీరి అక్రమ సంబంధం అలాగే చాటుమాటుగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల అనిత గొర్రెలను మేపడానికి పొలానికి వెళ్లింది. ఆ సమయంలో ప్రియుడు ఫోన్ చేయడంతో పక్కనే ఉన్న గుట్ట వద్దకు రావాలని కోరింది. అక్కడ ఇద్దరూ కలిసి రాసలీలలు షురూ చేశారు. దీంతో గొర్రెలు మేత మేసుకుంటూ పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చాయి. ఆ సమయంలో ఆటోతో అటుగా వెళ్తోన్న అనిత భర్త రమేష్ ఆ గొర్రెలు తమవే అని గుర్తించాడడు. వెంటనే ఆగి భార్య అనిత కోసం చూడగా ఆమె ఆ చుట్టు పక్కల కనిపించలేదు. వెంటనే ఫోన్ చేసినా..ఆమె స్పందించలేదు. దీంతో రమేశ్ భార్య కోసం వెతుకుతూ గుట్ట పైకి వచ్చాడు.
అయితే అక్కడ ప్రపంచాన్ని మరిచి ప్రియుడితో రతి క్రీడలో ఉన్న భార్యను చూసి అతడు షాక్ కు గురయ్యాడు. కోపంతో వారిద్దర్నీ చితకబాది..తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. అనంతరం గ్రామంలో పంచాయితీ పెట్టించి..భార్య నుంచి విడాకులు ఇప్పించాలని పెద్దల్ని కోరాడు. పిల్లలు ఇబ్బందులు పడతారని..ఇద్దరూ కలిసే ఉండాలని పెద్ద మనుషులు సూచించారు. మరో సారి ఇలాంటి తప్పు చేయవద్దని భార్యను హెచ్చరించాడు. ఆమె ప్రియుడిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.