చైనా నుంచి భారత్‌కు శాంసంగ్‌ !

సౌత్‌కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ భారత్‌లో రూ.4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. శాంసంగ్‌ తన మొబైల్, ఐటీ డిస్‌ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి ఉత్తరప్రదేశ్‌కు మార్చనున్నట్లు యూపీ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని శాంసంగ్‌ డిస్‌ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా యూపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ సంస్థకు ఇప్పటికే నోయిడాలో మొబైల్ తయారీ యూనిట్ ఉండగా దీనిని ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ప్రారంభించారు.

శాంసంగ్‌ భారత్‌లో ఏర్పాటు చేయబోతున్న తొలి హై టెక్నీక్ ప్రాజెక్టు ఇదేనని ఇలాంటి యూనిట్ కలిగిన మూడో దేశం భారత్’ అని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెక్స్‌ (SPECS) ప్రోత్సాహక పథకం కింద కంపెనీకి 460 కోట్ల ఆర్థిక ప్రోత్సాహం కూడా లభించనుంది.