ఈయన కేరళ రియల్ బాహుబలి.. ఏం చేశాడంటే..? (వీడియో)

బాహుబలి సినిమా మనం చూశాం కదా. సినిమాలో ప్రతి సీన్ అద్భుతమే అనే వాళ్లు ఉన్నారు. సినిమాలో ఒక సన్నివేశం… బాహుబలి (ప్రభాస్) విదేశీ పర్యటన ముగింపు వేళ దేవసేన (అనుష్క)ను వెంట తీసుకుని పడవ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు పడవలో ఎక్కేందుకు దేవసేన ఇబ్బంది పడుతుంటది. అప్పటికే బాహు పడవలోకి ఎక్కేస్తాడు. దేవసేన ఇబ్బందిని గుర్తించిన బాహు పడవ నుంచి కిందకు దూకుతాడు. ఒక చేత్తో పడవను, మరో చేత్తో ఒడ్డును పట్టుకుంటాడు. అప్పుడు దేవసేన వెంటనే బాహుబలి భుజాలపై నడుస్తూ పడవలోకి చేరుకుంటుంది. ఇది బాహుబలి 2 చిత్రంలో అద్భుతమైన సన్నివేశం.

సరిగ్గా ఇప్పుడు కేరళ వరదల విషయానికి వద్దాం. కింద ఉన్న వీడియోలో సహాయక సిబ్బందిలో ఒకరు బాహుబలి అవతారమెత్తాడు. బాహుబలి తన ప్రేయసిని భుజాలపై నడిపిస్తే.. ఈ వీర కిశోరం మాత్రం ఆపదలో ఉన్న వరద బాధితులకు తన వీపునే వంతెనగా మార్చి వారిని పడవలో ఎక్కించుకున్నాడు. దేశ ప్రజలంతా ఈ గొప్ప మనిషి సేవలను కొనియాడుతున్నారు. 

ప్రస్తుతం ఈ వీడియో దేశమంతా వైరల్ గా మారింది. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ, పోలీస్, ఇతర విభాగాల వారి సేవలు చూసి భారతావని అభినందనలు చెబతున్నది. వీడియో కింద ఉంది చూడండి. కేరళ బాహుబలి గొప్పదనం ఏంటో..?