Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ కన్నుమూత… ఏడు రోజుల పాటు సంతాపదినాలు!

Manmohan Singh: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి మనకు తెలిసినదే. ఉన్నఫలంగా ఈయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడానికి ఈయన ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేశారు అయితే ఈయన పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో తుది శ్వాస విడిచారు. ఈ విధంగా మన్మోహన్ సింగ్ మరణించడంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇకపోతే ఈయన అంత్యక్రియలను రేపు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈయన మరణించడంతో ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇక ప్రభుత్వ లాంఛనాలతో ఈయన అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఇక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో తెలంగాణలో ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలు కాలేజీలు స్కూళ్లకు కూడా సెలవు దినంగా ప్రకటించారు.

ఈయన 2004వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు కూడా భారత ప్రధానిగా బాధ్యతలను తీసుకున్నారు. ఇక మన్మోహన్ సింగ్ మరణాన్ని ఉద్దేశిస్తూ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అలాగే అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులూ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు అదే విధంగా ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటిస్తున్నారు.