పాక్ కు చిక్కినా చెక్కు చెదరని ధైర్యం, ఇంతకీ ఈ అభినందన్ ఎవరు?

 

టెర్రిరిస్టుల మీద సాగుతున్న యుద్ధంలో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ జీవితం ఒక సినిమాకథలాగా ఉంటుంది.

నిజానికి వాళ్ల కుటుంబానికి  2017 లో వచ్చి అవార్డులందుకున ఒక తమిళ సినిమా కి సంబంధం కూడా ఉంది. ఆ సినిమాలో కూడా ఒక పైలట్ పాక్ లో 1999 కార్గిల్ యుద్ధ ఖైదీగా దొరుకుతాడు.ఇందులో పైలట్ వరుణ్ చక్రపాణి కూాడా స్క్వాడ్రన్ లీడరే.  సినిమా కథ ఫుల్ రొమాన్స్ . అదే వేరే విషయం.

నిన్నటి నుంచి అభినందన్ భారతీయులు కొత్త హీరో అయ్యారు. హీరో ల్లేక, రాజకీయ నాయకుల్లో హీరోల్ని చూల్లేక అల్లాడిపోతున్న భారతీయ యువతకు ఒక హీరో దొరికాడు. అంతే, ఎవరీ అభినందన్ ఏమా కథ అంటూ ఇంటర్నెట్ లో విపరీతంగా వేదుకుతున్నారు. ఆయన పాకిస్తాన్ నుంచి సురక్షితంగా తిరిగి కోరుతున్నారు.

జెనీవా యుద్ధ ఖైదీల వప్పందం ప్రకారం ఆయనను వెంటనే భారత్ కు తిప్పిపంపాలని భారత ప్రభుత్వం కూడా కోరింది. ఎందుకంటే, పాకిస్తాన్ కూడా ఈ ఒప్పందానికి భాగస్వామియే. ఈ వప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను వారం రోజుల్లోపు మాతృదేశానికి తిప్పి పంపాలి. అలా కాని పక్షంలో యుద్ధం చేస్తున్నట్లు లెక్క.

ఇక పోతే, వర్ధమాన్ అభినందన్ విషయానికొద్దాం.

 శతృ నిర్బంధం లో ఉన్నా ఆయన మనో ధైర్యం చెక్కు చెదరలేదని  పాకిస్తాన్ లీక్ చేసిన వీడియో చెబుతుంది. ఆయన వీడియో లీక్ చేయడం జెనీవా యుద్ధ ఖైదీల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అయినా సరే, ఇది ఒక విధంగా భారత దేశానికి పనికొచ్చింది. ఆయన సురక్షితంగా ఉన్నట్లు ఒక అధారంమ అయింది.

అభినందన్ఆ తో బలవంతంగా మాట్లాడిస్తున్నట్లు కనిపించలేదు. ఆయన నిబ్బరంగానే ఉన్నారు. ఈ ధైర్యం ఆయన కుటుంబ నేఫథ్యం నుంచి వచ్చి వుండవచ్చు. ఎందుకంటే ఆయన కుటుంబానికి  యుద్ధం  కొత్త కాదు. ఆ కుటుంబలో ఆయన మూడో తరం సైనికాధికారి. ఆయన కుటుంబ సభ్యలు చాలా కాలం సాయుధ దళాలలో పని చేశారు. అభినందన్ తండ్రి ఎస్. అభినందన్ భారత వాయు సేనలో పని చేసి 2012లో ఎయిర్ మార్షల్ గా రిటైరయ్యారు. బాగా ప్రశంసలందుకున్న అధికారి. మిలిటరీ భాషలో ఆయన ‘highly decorated officer’. ఆయన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. అంతేకాదు, కోట్ల డాలర్ల విలువ చేసే ఫిప్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ (FGFA) ప్రాజక్ట్ ను స్టడీ చేసే కమిటీలో సభ్యుడు కూడా.
అభినందన్ తాత కూడా వాయుసేనలోనే పని చేశారు. దీనితో మనవాడు మూడో తరం వీరుడయ్యాడు.

అభినందన్ భార్యకూడా వాయుసేన పైలటే..

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు అభినందన్ సొంతవూరు . చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సమీపంలో రిటైర్డ్ అధికారుల కాలనీలో ఆయన తల్లి తండ్రి నివసిస్తున్నారు. అభినందన్ ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లరు ఉన్నారు. భార్య తన్వీ మెర్వాహా కూడా భారత వాయుసేనలో పైలట్ గా పనిచేసి స్క్వాడ్రన్ లీడర్ గా రిటైర్ అయ్యారు. అభినందన్ మాత్రం బెంగూళూరులో నివసిస్తున్నారు. హెలికాప్టర్ రంగంలో  తన్వికి పదేళ్ల అనుభవం ఉంది. 1600 గంటలు హెలికాప్టర్లను నడిపారు.

అభినందన్ బంధువులు చెప్పిందాని ప్రకారం అభినందన్ 2004లో ఎయిర్ ఫోర్స్ లో చేారారు. తాంబరం ఎయిర్ బేస్ లో శిక్షణ పొందారు. ఆయనకు పుస్తకాలంటే బాగా ఇష్టం. మిగ్-21 విమానం నడపడం ఆయన బాగా ఇష్టం. మిగ్ -21 అనేది సూపర్ సోనిక్ జెట్, శత్రువిమానాలను అడ్డిగించడంలో బాగా పని చేస్తుంది. 

అభినందన్ పాక్ చేతికి చిక్కారని వార్త వెలువడగానే చెన్నైలో ఆయన తల్లితండ్రులు నివసిస్తున్న కాలనీ గేటు మూసేశారు. ఎందుకంటే, సందర్శకుల, మీడియా తాకిడి ఎక్కువయింది. కాలనీలో పోలీసు భధ్రత పెంచారు. వర్ధమాన్ కుటుంబ సభ్యలను ఎవరూ కలవకుండా కాపలా పెట్టారు. బంధువులను కూడా అనుమతించడం లేదు. తనకుమారుడి వివరాలకోసం తననెవరూ సంప్రదించవద్దని ఆయన తండ్రి మీడియాకు విజ్ఞప్తి చేశారు.

మరొక విశేషమేంటే ఎస్ వర్ధమాన్ కు ప్రఖ్యాత తమిళ చిత్ర దర్శకుడు మణిరత్నం తో సంబంధాలున్నాయి. కాట్రు వెలియిదై సినిమా కథ తెలుసు కదా. పాకిస్తాన్ లో ఒక ఇండియన్ పైలట్ యుద్ధ ఖైదీగా ఉంటారు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉంటుంది. అక్కడ పని చేసే ఒక నర్సు ప్రేమలోపడతారు. ఇదీ కథ.

ఇది కూడ చదవండి

పాక్ అల్లరి మూకల చేతి నుండి అభినందన్ ఎలా తప్పించుకున్నాడు

 

పాక్ టు ఇండియా: సంఝౌతా ఎక్స్ ప్రెస్ బంద్