కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇప్పటికే రైతు భరోసా స్కీమ్ ద్వారా రైతులకు బెనిఫిట్ కలిగిస్తున్న మోదీ సర్కార్ ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ ద్వారా రైతులు సోలార్ పంప్ లను అమర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఈ స్కీమ్ ద్వారా రైతులు పొలంలో సోలార్ ప్యానెల్స్ ను అమర్చుకుని కళ్లు చెదిరే లాభాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. సోలార్ కంపెనీల నుంచి రైతులు అద్దె తీసుకోవడం లేదా సోలార్ కరెంట్ ను కంపెనీలకు విక్రయించడం ద్వారా కళ్లు చెదిరే ఆదాయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్న వాళ్లకు భారీ స్థాయిలో ఆదాయం అందుతుంది.
కనీసం 25 సంవత్సరాల పాటు పొలాలను కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అద్దెకు ఇస్తే 25 సంవత్సరాల తర్వాత ఎకరానికి 4 లక్షల రూపాయల చొప్పున ఆదాయం లభిస్తుంది. రైతులు డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.
పీపీపీ మోడల్ లో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. రైతుల పొలాలకు 1000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లభించే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా రైతులకు అదిరిపోయే లాభాలు అయితే వస్తాయని చెప్పవచ్చు. రైతులకు బెనిఫిట్ కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు 90 శాతం సబ్సిడీ పొందవచ్చు.