మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్.. 2023 బడ్జెట్ విశేషాలు ఇవే!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ కు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల కోసం కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. రెండు సంవత్సరాల కాలానికి ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన మహిళలకు ఏకంగా 7.5 శాతం వడ్డీ లభించనుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పాక్షిక మినహాయింపులు ఉంటాయని సమాచారం. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గా ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం అందుతోంది. మోదీ సర్కార్ బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు కూడా ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కు గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలుగా ఉండగా ఆ పరిమితి 30 లక్షల రూపాయలకు పెరగనుందని తెలుస్తోంది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్లీ ఇన్ కమ్ పరిమితిని సైతం కేంద్రం పెంచడం గమనార్హం. ప్రస్తుతం 4.5 లక్షల రూపాయల పరిమితితో ఈ స్కీమ్ ఉండగా కేంద్రం ఈ స్కీమ్ ను ఏకంగా 9 లక్షల రూపాయలకు పెంచడం గమనార్హం. జాయింట్ అకౌంట్ కలిగి ఉన్నవారికి ఈ మొత్తాన్ని 15 లక్షల రూపాయలకు పెంచారు.

గత బడ్జెట్లతో పోల్చి చూస్తే మాత్రం ఈ బడ్జెట్ మెరుగ్గానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి.