రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వారి జీవితాల్ని మార్చగలరా.?

రాష్ట్రపతిగా తొలిసారి ఓ గిరిజన మహిళకు అవకాశం దక్కిందంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. నిజమే, ఓ గిరిజన మహిళ తొలిసారిగా దేశ ప్రధమ పౌరురాలిగా మారారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

నిజానికి, ఇలాంటి పదవుల విషయంలో మహిళ, పురుషుడు, దళితులు, అగ్ర వర్ణాలకు చెందినవారు, బీసీలు, గిరిజనులు, మైనార్టీలు.. ఇలాంటి పదాల ప్రస్తావన అస్సలేమాత్రం సబబుగా అనిపించదు. కానీ, రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం.. వీటి ప్రస్తావన లేకుండా అస్సలు బండి నడవదు.

సరే, గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారు.’ వాట్ నెక్స్‌ట్.? దేశంలో గిరిజనం అభివృద్ధికి దూరంగా విసిరివేయబడ్డారన్నది నిర్వివాదాంశం. దళితులకు రిజర్వేషన్లున్నాయి.. గిరిజనుల కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలున్నాయి. బీసీల విషయంలో అయినా అంతే.!

మరి, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. తనకున్న విశేషాధికారాలతో దేశవ్యాప్తంగా వున్న కోట్లాది మంది గిరిజనుల జీవితాల్లోఎలాంటి మార్పులు తీసుకురాగలుగుతారు.? అలా మార్పు తీసుకొచ్చేందుకు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు ఎంతవరకు సహకరిస్తాయి.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా గవర్నర్, రాష్ట్రపతి లాంటి పదవుల్ని పేపర్ వెయిట్‌గానో, రబ్బరు స్టాంపుగానే అభివర్ణించడం పరిపాటిగా మారిపోయింది. ఈ తీరుని ఎవరూ మార్చలేకపోతున్నారు. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గనుక