పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేది. పెళ్లిపై వధూవరులకు ఎన్నోఆశలు, ఆశయాలు ఉంటాయి. మూడు ముళ్లు.. ఏడడుగుల అనుబంధంతో ఒక్కటయ్యే ఈ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని అంతా ఆశిస్తారు. అయితే ఆ వధువు మాత్రం పెళ్లికి నానాతంటాలు పడాల్సి వచ్చింది.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు తమిళనాడులోని పులుల అభయారణ్యం శివారులోని మరాహాడా గ్రామంలో వర్షాలకు మోయార్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే వరద సమయంలో నదిలో తెప్పలపై ప్రయాణించడం నిషిద్దం. నదికి అవతలి వైపు కళ్యాణ మండపంలో గ్రామానికి చెందిన యువతి రాసాథికి సోమవారం వివాహం జరగాల్సి ఉంది.
వరదలతో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వరదలు పెరుగుతాయని భావించిన కుటుంబ సభ్యులు ముందుగానే మండపానికి చేరుకోవాలని భావించి అటవీ శాఖాధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అనంతరం రెండు తెప్పలతో చాలా జాగ్రత్తలతో నదిని దాటించారు. దీంతో పెళ్లికి మార్గం సుగమమైంది.
అందుకేనోమె పెద్దళ్లు పెళ్లి చేసి చూడు… ఇల్లు కట్టి చూడు అన్నారేమో. పెళ్లి చేసుకోవడానికి విపత్తు అడ్డుపడితే విపత్తును ఎదురించి విజేతగా నిలిచిన వధువు కుటుంబ సభ్యులను అంతా అభినందిస్తున్నారు. టెన్షన్ పడిన వధువు ముఖములో సిగ్గును చిరునవ్వుతో చూపిందని బందువులు అన్నారు.