మహావిష్ణువుని వివాహం చేసుకున్న యువతి… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మన భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇత్త వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు వివాహాలు చేయాలని ప్రతి తల్లిదండ్రి ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది యువతులు ఈ వివాహ ఆచారం పట్ల ఇష్టంగా వ్యవహరిస్తున్నారు. వివాహం చేసుకొని ఒకరి దగ్గరగా బానిసగా బ్రతక కూడదు అన్న ఉద్దేశంతో కొంతమంది యువతులు వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అయితే ఇత్త వయసు వచ్చిన తర్వాత కూడా యువతులు వివాహం చేసుకోకపోతే ఇరుగుపొరుగువారు బంధుమిత్రులు వివాహం చేసుకోమని ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా తల్లిదండ్రులు బంధుమిత్రులు పోరుబడలేక కొంతమంది అహిష్టంగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఇలా ఒక మహిళ కూడా తనకు ఇష్టం లేకపోయినా ఇరుగుపొరుగు వారి బలవంతం మీద పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

అయితే ఆ తర్వాత ఆ యువతి వరుడి విషయంలో ఇచ్చిన ట్విస్ట్ కి అందరూ షాక్ అయ్యారు. వివాహం చేసుకోమని బలవంత పెట్టిన తర్వాత ఆ యువతి ఏకంగా మహావిష్ణువుని వివాహం చేసుకొని ఆ దేవుడికి భార్యగా మారింది. ఈ సంఘటన డిసెంబర్ 8వ తేదీన
జైపూర్ లోని గోవింద్ ఘాడ్ కు సమీపంలోని గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… రాజస్థాన్ కు చెందిన 30 ఏళ్ల పూజాసింగ్ అనే యువతి హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గణేష్ పూజ సప్తపది అగ్నిసాక్షితో మహా విష్ణువు ని వివాహం చేసుకుంది. పూజ సింగ్ చేసుకున్న వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణం ఏంటి అని అడిగితే . తన తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి తను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు పూజా సింగ్ చెప్పింది. వివాహం చేసుకుంటే భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయని,ఇష్టం లేకపోయినా కూడా జీవితాంతం ఒక వ్యక్తి దగ్గర బానిసగా బ్రతకలేనని పూజ సింగ్ వెల్లడించింది. అయితే కుటుంబసభ్యుల పోరు పడలేక తాను నిత్యం ఆరాధించే మహా విష్ణువు కి తన జీవితం అంకితం చేయాలని భావించి ఇలా వివాహాం చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పూజా సింగ్ ప్రతిరోజు గుడిలో మహా విష్ణువు కి సపరియలు చేస్తూ జీవితం గడుపుతోంది.