బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతన్న పీకే పార్టీ

నితీష్ కుమార్ పార్టీలో చేరిన ప్రశాంత్ కిషోర్ ఆయనతో సిద్ధాంత పరంగా విభేదించి బయటకు వచ్చారు. రాజకీయ పరిశీలకులు అందరూ ప్రశాంత్ కిషోర్ రాష్ట్రీయ జనతా దళ్ కి మద్దతుగా నిలుస్తారని భావించారు. అయితే తాజాగా తెలిసిన సమాచారం మేరకు ప్రశాంత్ కిషోర్ సొంతంగా ఒక పార్టీ పెట్టబోతున్నాడు అని తెలిసింది. అయితే ఈ పార్టీ కేవలం బీహార్ వరకే పరిమితం అవుతుందా లేక దేశవ్యాప్తంగా ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

నితీష్ కుమార్ తనకు తండ్రి లాంటి వారని కానీ అభిప్రాయబేధాలు వల్లే పార్టీ నుండి బయటకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తన బహిష్కరణ తనకు సంబంధం లేదని అది కేవలం నితీష్ కుమార్ కు సంబంధించిన వ్యవహారం అని చెప్పారు.

బీహార్లో అభివృద్ధి 2005లోనే ఆగిపోయిందని ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా నితీష్ కుమార్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. గాంధీ సిద్ధాంతాలు పాటించే పార్టీ గాడ్సేను సమర్థించే పార్టీతో  ఎలా కలిసి పని చేస్తుందని ప్రశ్నించారు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ కిషోర్ కోటి మంది బీహార్ యువకులతో ఒక బలమైన టీమ్ ని  తయారు చేయాలని అది తన పార్టీకి ఒక పునాదిగా ఏర్పడాలని కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తరువాత తన సొంత పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నారట.