ఇకపై రైల్వే ఫ్లాట్‌ ఫాం టికెట్ ధర రూ.50

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా పేర్కొంటూ.. రైల్వే శాఖ ఫ్లాట్‌ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచేసింది. ఫ్లాట్‌ ఫాం ధర ప్రస్తుతం రూ.10 ఉండగా దాన్ని ఐదు రెట్లు పెంచి రూ.50 చేసి ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 250 స్టేషన్లలో ఈ ధరలను అమలు చేస్తోంది. సికింద్రాబాద్ వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ధరలే అమలులో ఉంటాయని తెలిపారు.
.
రైల్వే శాఖ పెంచిన ఈ ధరలు రేపటి నుండి అంటే.. మార్చి 18 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 137కి చేరుకోగా ముగ్గురు మృతి చెందారు. పాజిటివ్ కేసుల విశయంలో మహారాష్ట్రలో అత్యధికంగా 36 కేసులతో తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాత 4 పాజిటివ్ కేసులతో రెండో స్తానంలో నిలిచింది.