ప్రివ్యూ : ‘వకీల్ సాబ్’ వాయించి వదిలాడట !

Pawan's Vakeel Saab preview talk
Pawan's Vakeel Saab preview talk
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ ఇంకొన్ని గంటల్లో విడుదలకానుంది.  మూడేళ్ళుగా పవన్ ను వెండి తెర మీద చూడలేకపోయిన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.  సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది.  ప్రీరిలీజ్ బిజినెస్ 85 కోట్లకు పైగానే జరిగింది.  డిస్ట్రుబ్యూటర్లు లాభాలు చూడాలంటే సినిమా 100 కోట్ల షేర్ సాధించాలి.  ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హిట్టవ్వాలి.  పైగా లాక్ డౌన్ అనంతరం వస్తున్న పెద్ద సినిమా.  ఈ సినిమా ఫలితాన్ని బట్టే తర్వాత పెద్ద సినిమాల విడుదలలు ఆధారపడి ఉంటాయి.  మరొకవైపు కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానం.  ఇన్ని ప్రశ్నల నడుమ వస్తున్న ‘వకీల్ సాబ్’ అన్నింటికీ సరైన సమాధానం ఇస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.  
 
వారి నమ్మకం నిజమవుతుందా లేదా అనేది అంచనా వేయడానికి ఈ ఇండస్ట్రీ వర్గాల, సినీ సన్నిహిత వర్గాల, సినిమా గురించి పూర్తి వివరం తెలిసిన వారి మాటల ద్వారా ఒక అంచనా వేయడం జరిగింది.  వారి మాటల ప్రకారం సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని అర్థమవుతోంది.  పేరుకు ‘పింక్’ రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన హంగులన్నీ ఉంటాయట.  కథలో మార్పుకు జరిగినా ఆత్మ మిస్ అవకుండా జాగ్రత్తాపడ్డారట డైరెక్టర్ వేణు శ్రీరామ్.  పవన్ గత సినిమాల మాదిరి ప్రతి సన్నివేశంలోనూ పవర్ స్టార్ కనబడే సినిమా కాదట ఇది.  కథకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందట.  అయితే పవన్ కనబడే ప్రతి సీన్ సగటు అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట.  
 
పవన్ అస్తమానం కనబడకపోవడం ఫ్యాన్సుకు ఇబ్బంది కలిగించినా కూడ పవన్ పవర్ఫుల్ ఇంట్రో, హై ఓల్టేజ్ ఫైట్స్ ఆకట్టుకుంటాయట.  ఇక కీలకమైన కోర్ట్ రూమ్ సీన్స్, పవన్ ఆర్గ్యుమెంట్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు.  తమన్ సంగీతం సినిమా లెవల్ పెంచగా రెండు పాటల్లో గుర్తుండిపోయే విజువల్స్ ఉన్నాయట.  పవన్ లుక్స్, డైలాగ్స్ పాస్ మార్కులు వేయించుకుంటాయట.  మొత్తంగా చెప్పాలంటే పవన్ అభిమానులకు, ప్రేక్షకులకు సినిమా సంతృప్తిని ఇస్తుందని అంటున్నారు.  ట్రేడ్ వర్గాలైతే ఫస్ట్ డే షేర్ 40 కోట్ల మార్క్ తాకావచ్చని అంచనా వేస్తున్నాయి.