నటీనటులు : శేఖర్ వర్మ, వివియా సంత్, జయ ప్రకాష్, సుదర్శన్
దర్శకత్వం : సతీష్ రేగల్ల
నిర్మాతలు : కే ఎన్ రావు.
సంగీతం : చరణ్ అర్జున్.
విడుదల తేదీ : 23-08-2019
సినిమా కథ : అమెరికాలో సెటిల్ అయిన సూర్యనారాయణ వర్మ(జయ ప్రకాష్) ఒక బిలినియర్. అయితే తన కుమారుడు వివాన్ ఆదిత్య(శేఖర్ వర్మ)ను చాలా గారాబంగా ఏ కష్టం తెలీకుండా పెంచుతాడు. దాంతో తన కొడుకుకి ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటాడు. అసలు ప్రపంచం అంటే ఏమిటి? మనుషుల మధ్య వుండే ఎమోషన్స్.. బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయి? తెలుసుకోమని కొన్ని షరతులు విధించి… తక్కువ డబ్బు ఇచ్చి ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లమంటాడు. అలా వెళ్లిన హీరోకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? తన తండ్రి ఆశించిన విధంగా తనలో మార్పులు వచ్చాయా? తన మూలాలను కనుగొన్నాడా? తదితర వివరాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
హీరో
హీరోయిన్
కామెడీ సుదర్శన్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
సినిమా విశ్లేషణ : ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయికి కష్ట సుఖాలు బంధాలు బంధుత్వాలు, మనుషుల మధ్య వుండే ఎమోషన్స్ తెలియాలంటే ఓ సామాన్యునిగా సాధారణ మనుషుల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో జీవించాలి.. అనే కథ, కథనంతో ‘నివాసి’ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు యూత్ కి నచ్చుతుంది.
ఈ సినిమా హీరోతో పాటుగా కథ మొత్తం కమెడియన్ సుదర్శన్ పాత్ర ట్రావెల్ అవుతూ అవసరమైన చోటల్లా నవ్విస్తుంది.కథానుసారం వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి.హీరో లుక్స్ పరంగా రిచ్ కిడ్ గా కరెక్ట్ గా సెట్టయ్యాడు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సీన్లకు ప్రేమికులు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు జయ ప్రకాష్ బాధ్యత గల తండ్రి పాత్రకు జీవం పోశారు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరో తన ప్రయాణంలో కలుసుకునే ప్రతీ పాత్రకు ఒక ఎమోషనల్ కంక్లూజన్ ఇచ్చేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది. హీరో తన ప్రయాణంలో కల్మషం లేని స్నేహం, నిజమైన ప్రేమ బంధుత్వాలలో ఉండే స్వార్ధం, ప్రేమలలో ఉండే వ్యత్యాసాన్ని చూపించిన విధానం బాగుంది. చివరగా హీరోయిన్ నటన అన్ని కోణాల్లో కంటే ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించింది.
చివరి మాట : ఫ్యామిలీ బంధాలు అనుబంధాలు తెలిసే చిత్రమే నివాసి