30 Rojullo Preminchatam Ela Review: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ

30 rojullo preminchatam ela movie review

సినిమా పేరు : 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?

నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, హైపర్ ఆది, శుభలేఖ సుధాకర్, హేమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

నిర్మాత : ఎస్వీ బాబు

డైరెక్టర్ : మున్నా

రిలీజ్ డేట్ : 29 జనవరి 2021

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ ప్రదీప్. ప్రదీప్ మాచిరాజు కన్నా.. యాంకర్ ప్రదీప్ అంటేనే వెంటనే గుర్తుపట్టేస్తారు జనాలు. బుల్లితెర మీద నో డౌట్.. ప్రదీప్ టాప్ యాంకర్. ఆయన తర్వాతనే ఎవ్వరైనా. ఎంటర్ టైన్ మెంట్ ను పంచడంలో కానీ.. యాంకరింగ్ చేయడంలో కానీ.. ఎదుటివారిపై పంచులు వేయడంలో కానీ ప్రదీప్ ను మించిన వాళ్లు లేరు. ప్రదీప్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్ టైన్ మెంట్ కు కొదువ ఉండదు. అందుకే.. ఎక్కువ చానెల్స్ తమ ప్రోగ్రామ్స్ కు కానీ.. షోలకు కానీ.. ప్రదీప్ నే యాంకర్ గా పెట్టుకుంటాయి.

యాంకర్ ప్రదీప్ కు వెండి తెర మీద కూడా పరిచయం ఉంది. చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించాడు కానీ.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ.. తొలిసారిగా యాంకర్ ప్రదీప్.. హీరోగా వెండి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా భారీ సబ్జెక్ట్ తో. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? అంటూ ప్రేక్షకుల మందుకు వచ్చాడు ప్రదీప్. నిజానికి ఈ సినిమా ఎప్పుడ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల గత సంవత్సరం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. తాజాగా 29 డిసెంబర్ న విడుదలయింది. మరి.. తన తొలి సినిమాతో బుల్లితెర యాంకర్ ప్రదీప్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం కథలోకి వెళ్లాల్సిందే.

ఇదే కథ

ఈ సినిమాలోని స్టోరీ లైన్ ఒక ముక్కలో చెప్పాలంటే.. ఎప్పుడో పుట్టి.. ప్రేమికులుగా ఉండి.. తర్వాత విడిపోయి.. పెళ్లి చేసుకోకుండానే చనిపోయి.. మళ్లీ ఓ 50 ఏళ్ల తర్వాత పుట్టి.. మళ్లీ కలుసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం. ఇదే అసలు కథ. కానీ.. దీన్ని డైరెక్టర్ రెండున్నర గంటల్లో చూపించాలి కాబట్టి.. దానికి కాస్త వినోదం, కాస్త ఎమోషనల్ సీన్స్, కాస్త సెంటిమెంట్.. కొన్ని పాటలు.. ఇవన్నీ కలగలిపాడు అన్నమాట.

అది 1947 వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ప్రేమించుకున్న ఓ జంట.. కొన్ని మనస్పర్థల వల్ల విడిపోతుంది. ఆ తర్వాత పెళ్లి కాకుండానే ఇద్దరూ చనిపోతారు. కట్ చేస్తే.. అదే జంట మళ్లీ పుడతారు. వాళ్లిద్దరు ఎవరో కాదు.. అర్జున్, అక్షర. అర్జునే మన హీరో ప్రదీప్. అక్షరే మన హీరోయిన్ అమృత అయ్యర్.

30 rojullo preminchatam ela movie review
30 rojullo preminchatam ela movie review

అయితే.. ఇద్దరికి ముందు తెలియదు. తామిద్దరం పోయిన జన్మలో ప్రేమికులమని. ఇద్దరూ ఒకే కాలేజీలో చదవడం వల్ల పరిచయం ఏర్పడుతుంది. కానీ.. ఇద్దరికి అస్సలు పడదు. ఇద్దరి మధ్య వైరం కూడా పెరుగుతుంది. అయితే.. కాలేజీ ఫ్రెండ్స్ తో కలిసి ఇద్దరూ విహార యాత్రకు వెళ్లినప్పుడు ఓ గుడికి వెళ్తారు. అక్కడ వీళ్లకు తమ పునర్జన్మ గుర్తొస్తుంది. అయితే వీళ్ల పునర్జన్మ గుర్తుకు రాగానే వీళ్ల జీవితాలు ఒక్కసారిగా తారుమారవుతాయి? ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీళ్లిద్దరూ ఎలా ప్రేమించుకుంటారు? అసలు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే టైటిల్ కు సినిమాకు సంబంధం ఏంటి? వీళ్లకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్యకు స్వామీజీ చూపించే పరిష్కారం ఏంటి? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్

సినిమాకు ప్లస్ పాయింట్స్ హీరో, హీరోయిన్స్, రెండు పాటలు. బుల్లితెర మీద ఎలాగూ తానేంటో నిరూపించుకున్నాడు ప్రదీప్. కానీ.. వెండి తెర మీద కూడా తన నటనతో ఇరగ్గొట్టేశాడు. ఎంతో ఈజ్ తో తన తొలిసినిమాలో నటించాడు. ఓవైపు కామెడీ, మరోవైపు ఎమోషనల్ సీన్స్ ను బాగానే పండించాడు ప్రదీప్. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ కూడా అంతే. తన పాత్రలో ఒదిగిపోయింది. మిగితా పాత్రల్లో నటించిన వాళ్లందరూ తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

ఇక.. నీలి నీలి ఆకాశం పాట మాత్రం సినిమాకే హైలెట్. చాలామందిని థియేటర్ల వరకు తీసుకొస్తున్నది ఆ పాటనే. దానితో పాటు మరో పాట కూడా సినిమాకు హైలెట్. అలాగే.. ఇంటర్వెల్ సీన్స్ సినిమాకే ప్రాణం. అవి లేకపోతే సినిమానే లేదు.

మైనస్ పాయింట్స్

నిజానికి ఈ సినిమా ఒక ప్రయోగం. సరికొత్త కత్త. రొటీన్ ఫార్ములా. పునర్జన్మ అంటూ కొత్త కథను ఎంచుకున్నప్పటికీ.. దాన్ని సరైన రీతిలో తెర మీద చూపించలేక దర్శకుడు కాస్త తడబడ్డట్టు తెలుస్తోంది. అందుకే.. ఫస్ట్ హాఫ్ కామెడీతో నెట్టుకొచ్చినా.. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా బోల్తా పడిపోయింది. బోర్ కొట్టేసింది. సినిమా నిడివి కూడా ఎక్కువైంది. కొన్ని సీన్లను కట్ చేస్తే ఇంకా బాగుండేది.

కన్ క్లూజన్

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే… పాటల కోసమో లేక ప్రదీప్ కోసమో లేక అమృత కోసమో కాసింత నవ్వు కోసమో సినిమాకు వెళ్తే ఓకే కానీ.. ఏదో ఎక్స్ పెక్టేషన్ పెట్టుకొని సినిమాకు వెళ్తే మాత్రం దెబ్బడిపోతారు. టైమ్ పాస్ కావాలంటే.. వెళ్లి ఓసారి చూసి వచ్చేయండి కానీ.. ఓవర్ గా ఊహించుకోకండి.

తెలుగురాజ్యం రేటింగ్ : 2.5/5