జాంబీ రెడ్డి నాన్ థియేట్రికల్ బిజినెస్.. అపుడే 3కోట్ల లాభం

కంటెంట్ కొత్తగా బావుంటే చిన్న సినిమాలు ఏ విధంగాను నష్టపోవని దర్శకుడు ప్రశాంత్ వర్మ నిరూపించాడు. ఫిబ్రవరి 5న విడుదల కాబోతున్న జాంబీ రెడ్డి సినిమా అప్పుడే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అ! సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ అనంతరం కల్కి సినిమాతో ఓ వారిని బాగానే ఆకట్టుకున్నాడు.

Impressive reports for Prashanth Varma's Zombie Reddy

అయితే సినిమాకు అప్పుడే 3.2కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు సమాచారం. నిర్మాతలు ఈ సినిమాను కేవలం 3.3కోట్ల బడ్జెట్ తోనే నిర్మించారని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ ఆ బడ్జెట్ లోనే చాలా క్వాలిటీగా సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. సినిమా ట్రైలర్ క్లిక్కవ్వడంతోనే నాన్ థియేట్రికల్ బిజినెస్ లో భారీ లాభాలను అందుకుంటున్నారు.

హిందీ డబ్బింగ్ రైట్స్ 2.2కోట్లకు అమ్ముడవ్వగా.. తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా 2.3కోట్లు, డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ మరో రెండు కోట్లు వచ్చాయి. ఇలా మొత్తంగా సినిమా విడుదలకు ముందే 6.5కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేయడంతో నిర్మాత పెట్టిన బడ్జెట్ పోను మూడు కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. విడుదలపై భారీగా అంచనాలు పెరిగడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.