Zee Studios : టాలీవుడ్ పై దృష్టి పెట్టిన జీ స్టూడియోస్… బాబాయ్, అబ్బాయ్ సినిమాలతో షురూ…!

Zee studios : ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ zee నెట్ వర్క్స్ ఇండియా లో నేషనల్ ఛానెల్ గా పరున్న ఛానల్. ఇక టెలివిజన్ రంగంలోనే కాకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన జీ నెట్ వర్క్స్ హిందీ సినిమాలను నిర్మించేది. అయితే ఇపుడు దక్షిణాది చిత్ర పరిశ్రమల మీద దృష్టి పెట్టింది.అయితే ఇప్పుడు పూర్తిగా తెలుగు సినిమాలపై దృష్టి సారించారు.ఈ మధ్యకాలంలో విడుదలైన నాగార్జున అండ్ నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’ చిత్రాన్ని నిర్వహించారు.

అయితే ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్‌లలో భాగమయ్యారు.శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘RC15’ సినిమాని జీ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈ సినిమాకి సంబంధించి నాన్-థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. సముద్రఖని దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వినోదయ సీతం’కి రీమేక్.ఈ సినిమాకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు.

ఇక రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం లో శ్రీకాంత్ ను ఒక కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారని సమాచారం.ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.ఇక పవన్ కళ్యాణ్ నటించబోతున్న రీమేక్ సినిమా కూడా త్వరగానే షూటింగ్ మొదలవుబోతోంది.