Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఊహించని విధంగా ఆదరణ లభించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు వైసిపి నేతలు అలాగే కార్యకర్తల మద్దతు పూర్తి స్థాయిలో ఉందని చెప్పాలి.
గతంలో అంబంటి రాంబాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎవరు అడ్డుపడిన ఈ సినిమాని అడ్డుకోలేరని ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు ఇక నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి సైతం ఈ సినిమాకు తన పూర్తి మద్దతు తెలిపారు తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం పుష్ప 2సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీ పుష్ప 2 సినిమా అంచనాలను మించి ఉంది. పుష్ప సినిమాతో తగ్గేదిలే అన్న మీరు పుష్ప 2 సినిమాతో అసలు తగ్గేదేలేదని నిరూపించారు.మా చిత్తూరు యాసతో వెండితెర పైన పలికిన తీరు ఈలలు వేయించేలా చేస్తోంది. అల్లు అర్జున్ గారి నటన అద్భుతం, యావద్దేశాన్ని సైతం మీ మాస్ ఇమేజ్ తో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనేటట్టుగా పూనకాలు తెప్పించారు. మా తిరుపతి గంగమ్మ జాతర సీన్ ఈ సినిమాకి హైలైట్ అని తెలియజేసింది. అందులో నటించిన తీరు శభాష్ అనిపించేలా ఉందని తెలిపింది రోజా.. మీ శ్రమకి తగ్గ ఫలితమే ఈ చిత్ర విజయం అంటూ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేసింది.
కేవలం అల్లు అర్జున్ నటన పట్ల మాత్రమే కాకుండా డైరెక్టర్ సుకుమార్ గురించి కూడా ఈమె పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇక ఈమె ఒక సినీ నటిగా అలాగే మాజీ మంత్రిగా కూడా ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పాజిటివ్ రివ్యూ ఇస్ ది సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఐకాన్ స్టార్…
మీ #Pushpa2ThaRule నిజంగా అంచనాలు మించిన చిత్రం… #pushpa తో తగ్గేదేలే అన్నారు… #Pushpa2 తో అస్సలు తగ్గేదేలే అనిపించారు.. మా చిత్తూరు యాస వెండి తెరపై పలికిన తీరు హాల్ లో ఈలలు వేయిస్తోంది @alluarjun గారు మీ నటన అద్భుతం , యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్ తో పుష్పా… pic.twitter.com/Ox1zjQwoJI— Roja Selvamani (@RojaSelvamaniRK) December 8, 2024