గూబ గుయ్యిమనిపిస్తున్న భారీ బడ్జెట్.!

పిచ్చి ముదిరి పాకాన పడింది.! ఔను, చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోల విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. పేరూ ఊరూ లేని హీరో కూడా ఐదు కోట్లు.. పది కోట్లు అంటున్నాడు.!

కానీ, థియేటర్లలో సినిమాలు వచ్చేసరికి నిర్మాతకు వాచిపోతోంది. కొన్ని సినిమాలు చేతులు మారిపోతున్నాయ్.. ముక్కీ మూలిగీ విడుదలవుతున్నాయ్. ఇంకొన్ని విడుదలకు నోచుకోవడంలేదు.

ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు బొక్క బోర్లా పడేసరికి, యంగ్ హీరోలకు వాత గట్టిగా పడుతోందిట. బడ్జెట్‌లో వీలుని బట్టి సగానికి కోత విధించేస్తున్నారట.

ఓ నలుగురైదుగురు యంగ్ హీరోలైతే ఏకంగా తమ రెమ్యునరేషన్ సగానికి తగ్గించుకోవాల్సి వచ్చిందట. తప్పదు మరి.. నిర్మాతకి గూబ గుయ్యిమంటే, హీరోలకీ చెంపలు వాచిపోతాయ్ కదా.!