ఆయనో యంగ్ హీరో.! పైగా ఈ మధ్యనే ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఫిట్టుగా వుండాల్సిన కుర్రాడేమో, ఫిట్నెస్ కోల్పోతున్నాడట. ఫ్రెండ్స్‌తో లేట్ నైట్ పార్టీల వల్లనే ఈ సమస్య వస్తోందిట.
గతంలో కూడా మనోడి మీద ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలేంటి.? మనిషి వున్నపళంగా మారిపోతుంటాడు. ఆ ‘మార్పు’ని దాచుకునే అవకాశమే లేదు. ప్రెస్టీజియస్ మూవీ కదా.. ఒకింత జాగ్రత్తగా వుండాలి కదా.? అంటే, ప్చ్.. తప్పడంలేదట.
ఫ్రస్ట్రేషన్.. ఫ్రస్ట్రేషన్.. ఫ్రస్ట్రేషన్.. రచ్చ గెలిచినా, ఇంట గెలవలేని కారణంగానే ఆ దుస్థితి అంటున్నారు. మరోపక్క, అంతా తూచ్.. ఇదంతా గిట్టనివారు చేస్తున్న ప్రచారమనీ అంటున్నారు.
లోగుట్టు పెరుమాళ్ళకెరుక. సినిమా ఒక్కటే కాదు, ఇతరత్రా వ్యవహారాలూ సదరు యంగ్ హీరోని మానసికంగా తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయట. ఎవరా హీరో.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!