Big Boss OTT: బిగ్ బాస్ హోస్ట్ గా యంగ్ హీరో… ప్రోమో వైరల్!

Big Boss OTT: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమాన్ని బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం చేయాలని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ కార్యక్రమాన్ని తెలుగు, తమిళ భాషలలో కూడా ప్రసారం చేయనున్నారు. ఇక తమిళంలో ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమానికి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీలో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా తాను వ్యవహరించలేదని కమల్ హాసన్ అధికారికంగా తెలియజేశారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ హోస్ట్ గా యంగ్ హీరో శింబు రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఈ విధంగా తన గురించి వచ్చిన వార్తలపై బిగ్ బాస్ నిర్వాహకులు స్పందిస్తూ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

కమల్ హాసన్ మరొక సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించలేదని చెప్పడంతో ఓటీటీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శింబు వ్యవహరించనున్నారని నిర్వాహకులు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో రెండు రోజులలో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ గురించి నిర్వాహకులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం 22 రోజుల పాటు 24 గంటలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయనుంది.