జీవాలో జగన్ ని చూసాను..దర్శకుడు గట్టి నమ్మకం

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ గా ఏపీలో అయితే రాజకీయాలు మంచి రసవత్తరంగా కొనసాగుతుంది. పైగా సినిమా వాళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వడం అలాగే రాజకీయ నాయకులూ కూడా సినిమాని వాడుకొని మరింత మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా అలా ఏపీలో రాజకీయ పరిస్థితులపై వస్తున్నా మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే “యాత్ర 2”.

గత ఎన్నికల సమయంలో వై ఎస్ రాజకేసఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించగా ఆ సినిమా మంచి హిట్టే అయ్యింది. దీనితో ఈసారి దానికి కొనసాగింపుగా వై ఎస్ జగన్ పాదయాత్రపై తమిళ హీరో జీవాతో చేస్తున్న సినిమానే “యాత్ర 2”. కాగా ఇందులో మమ్ముట్టి కూడా నటిస్తుండగా..

ఇద్దరు కూడా యాత్ర 2 లో కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో జీవా పై ఈ సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తాను సినిమా చేస్తున్న సమయంలో నటుడు జీవా వై ఎస్ జగన్ గా నటించిన నటన అద్భుతంగ చేసాడు అని.

తాను తన శ్వాసలో కూడా జగన్ ని తనలో ఇన్వాల్వ్ చేసేసుకొని అంతలా ఒదిగిపోయి చేసేశాడని నేను సెట్స్ అతనిలో జగన్ ని చూసాను రేపు మీరు అంతా కూడా రిలీజ్ రోజు చూస్తారు అను మెన్షన్ చేసాడు. కాగా ఈ చిత్రం అయితే మళ్ళీ వచ్చే ఎన్నికలకి ముందుగా ఫిబ్రవరి 8నే విడుదల చేస్తున్నట్టుగా తాను మళ్ళీ కన్ఫర్మ్ చేసాడు.

https://twitter.com/MahiVraghav/status/1714586231324213343