ఇండస్ట్రీ టాక్ : తమిళ్ క్రియేటివ్ డైరెక్టర్ తో యష్ మాసివ్ ప్రాజెక్ట్.?

Yash

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ స్టార్డం ఉన్న సౌత్ హీరోస్ లో రాకింగ్ స్టార్ యాష్ కూడా ఒకడు. కాగా కన్నడ నుంచి కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈ నటుడు ఈ సినిమాల తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది అత్యంత ఆసక్తిగా మారింది. అయితే రీసెంట్ గానే ఓ కన్నడ ప్రముఖ నిర్మాతతో యాష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు.

కానీ దీనికి దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. అయితే చాలా మంది టాప్ దర్శకులు పేర్లే వినిపించాయి. అయితే ఇప్పుడు ఓ ఊహించని తమిళ దర్శకుడు తో అయితే యష్ వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తమిళ సినీ ట్రాకర్స్ చెప్తున్నారు. మరి ఆ దర్శకుడు ఎవరో కాదట.

సాలిడ్ యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో మంచి సందేశాత్మక సినిమాలు తీస్తున్న దర్శకుడు పి ఎస్ మిత్రన్ తో అట. తాను రీసెంట్ గా చేసిన సినిమా “సర్దార్” చూసి ఒకొక్కరు షాక్ కూడా అయ్యారు. కొందరు అయితే ఈ సినిమాలో ఎలివేషన్స్ కేజీఎఫ్ ని మించి కూడా ఉన్నాయని అన్నారు.

మరి ఇలాంటి దర్శకునితో యష్ సినిమా అంటే ఇక అది ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఎంతవరకు ఓకే అయ్యింది అనేది ఇంకొంత కాలం ఆగాల్సిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి.