పవన్ కళ్యాణ్ వీరాభిమాని ప్రభాస్ ని ఫాలో అవడమేంటీ..?

టాలీవుడ్ లో యమ్హ్ హీరో నితిన్ కి ఒక సపరేట్ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ తేజ పరిచయం చేసిన నితిన్ కెరీర్ ప్రారంభం నుంచి తనకి తగ్గ కథలనే ఎంచుకుంటూ సాగుతున్నాడు. అయితే త్రివిక్రం దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమా తర్వాత వరసగా సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో కొంత గ్యా తీసుకున్న ఈ యంగ్ హీరో మంచి కథలని ఎంచుకొని ఒక్కొక్కటిగా సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు.

Rang De': First Look hits the right notes -

అలా ఈ సంవత్సరం ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ అందుకొని సక్సస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తర్వాత రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న “రంగ్ దే” సినిమాలో నటిస్తున్నాడు. సగానికి పైగా టాకీ పార్ట్ కంప్లీటయిన ఈ సినిమాని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా లాక్ డౌన్ తో చిత్రీకరణ నిలిచిపోయిన ఈ సినిమా తిరిగి ఇటీవలే ప్రారంభం అయి చిత్రీకరణ జరుగుతోంది.

అయితే కథలో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీల సన్నివేశాలని యూరప్ లో షూట్ చేయాలని ఇంతక ముందే షెడ్యూల్ ప్లాన్ చేసి క్యాన్సిల్ చేశారు. అయితే డార్లింగ్ ప్రభాస్ తన రాధే శ్యామ్ సినిమా షూట్ కోసం ఇటీవలే ఇటలీ కి చేరుకున్నారు. అక్కడ 15 రోజుల షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకిని తిరిగి ఇండియా రానున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ని ఫాలో అవుతు నితిన్ కూడా తన రంగ్ దే సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్ళనున్నాడని తాజా సమాచారం.

CHECK OFFICIAL MOVIE ,NITHIN,PRIYA Prakash Varrior,RAKUL PREET  SINGH,OFFICIAL POSTER UPDATE, - YouTube

ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో “చెక్” అన్న సినిమా చేయబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. భవ్య క్రియోషన్స్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమాని అధికారకంగా ప్రకటిస్తూ టైటిల్ ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు.