వామ్మో.. అప్పుడే రాజమౌళి సినిమాకు టెండర్ వేసిన బెల్లంకొండ గణేష్!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు అయిన బెల్లంకొండ గణేష్ తన తొలి చిత్రం అయిన స్వాతి ముత్యం అక్టోబర్ 5న విడుదల అయ్యింది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో బాల మురళిగా ఓ సాఫ్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పుకుంటూ వచ్చాడు. రావు రమేష్, వికె నరేష్, గోపరాజు రమణ తదితరులు కలిసి నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించడం జరిగింది.

అయితే థియేట్రికల్ విడుదలకు ముందు చాలా ఉత్సాహంగా ఉన్న ఈ కొత్త యంగ్ హీరో గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ కోసం మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి ఇంకా తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తనకు సంభందించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

గణేష్ తననీ తాను ఒక మధ్యతరగతి వ్యక్తిగా చూసుకుంటాననీ చెప్పుకొచ్చాడు. అతని అమ్మ అతడిని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పెంచిందనీ తెలిపాడు. వాళ్ళ నాన్న బెల్లంకొండ సురేష్ పుట్టడంతోనే ధనవంతుడు కాదనీ చాలా కష్టపడి డబ్బు సంపాదించాడనీ అతని తండ్రి గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతను ఆరవ తరగతిలో ఉన్నంత వరకు, ఒక చిన్న అద్దె ఇంట్లో నివసించేవాళ్ళం అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు అతని నాన్న ఎంతో ప్యాషన్‌తో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాడని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెడితే ముందుగా అతనీ సంతోషిస్తనని చెప్పాడు.

ఇక సినిమా విషయానికొస్తే స్వాతి ముత్యం ఒక్ స్పెర్మ్ డొనేషన్ రూపంలో ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని తెరకెక్కించిన సినిమా అని అయితే ఇది సినిమాలో చిన్న భాగం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని చక్కని సిట్యుయేషనల్ కామెడీగా రూపొందించిందంటు. ఈ సినిమాను పిల్లలు పెద్దలతో కలిసి చూడవచ్చు. సినిమాలో ఇబ్బంది కలిగించే ఒక్క సన్నివేశం అయిన ఒక డైలాగ్ అయిన లేదనీ చెప్పాడు.

అతను క్లాస్ పాత్రలకే పరిమితం కాను అని ఇంకా అతనికి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తానంటు చెప్పుకొచ్చాడు. మరో కొన్ని నెలల్లో ‘నేను స్టూడెంట్‌’ అనే థ్రిల్లర్‌తో వస్తానని చెప్పడం. ఇందులో స్టూడెంట్‌గా కనిపిస్తానంటు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందనీ చెప్పాడు. మహమ్మారి కారణంగా 2020లో పవన్ సాదినేనితో నా సినిమా నిలిపివేయాల్సి వచ్చిందనీ వాళ్ళకి యూఎస్ కి వీసాలు పొందలేకపోయమంటు తెలిపాడు.

ఓటీటీ సంస్కృతి ప్రేక్షకుల అంచనాలను మాత్రమే పెంచిందనీ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొత్తదనాన్ని అందిస్తే ఏ సినిమా అయినా ఫరవాలేదు ఆదరిస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఈ దసరాకు ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ పోస్టర్‌లతోపాటు తన సినిమా పోస్టర్‌ను కూడా చూసినందుకు ఎంతో ఆనందంగా ఉందంటు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

అతను నటించిన తొలి చిత్రం స్వాతి ముత్యం దసరా కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అతనికి అలాంటి డ్రీమ్ రోల్ లేదు అని చెప్పాడు. అయితే బహుశా రాజమౌళి సినిమాలో నటించడం అతని కల అంటూ తెలిపాడు. అతను వెంకటేష్‌ గారి అభిమానిననీ రాజా సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశానని చేప్పడం జరిగింది.