బాక్సాఫీస్ : ఫస్ట్ డే వరల్డ్ వైడ్ “సలార్” రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు.. 

టాలీవుడ్ ప్రైడ్ హీరోస్ లో ఒకడైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే “సలార్”. దాదాపు గత ఐదేళ్ల నుంచి ఓ సరైన హిట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ బిగ్ డే అయితే ఎట్టకేలకి నిన్న వచ్చింది. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ అనౌన్స్ చేసిన నాటి నుంచే తారా స్థాయి హైప్ ని అందుకుంది.

కాగా అలా ఫైనల్ గా ఎన్నో వాయిదాలు అనంతరం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం గట్టి టాక్ నే తెచ్చుకుంది. అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ బుకింగ్స్ ఇండియా సహా యూఎస్ మార్కెట్ లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే సరికి మొదటి రోజు మాత్రం వసూళ్లు రికార్డు లెవెల్లో వస్తాయని కన్ఫర్మ్ అయ్యిపోయింది.

ఇక ఈ సినిమా మొదటి రోజు వసూళ్ళని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ట్రేడ్ లో రిలీజ్ చేసింది. దీనితో అయితే ఈ సినిమా ఏకంగా మొదటి రోజు 178.8 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా తెలిపారు. దీనితో ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సలార్ ఇప్పుడు నిలిచింది.

మరి దీనికి ముందు ఆనిమల్, లియో, జవాన్ సహా ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్ కూడా లిస్ట్ లో ఉండగా ఫైనల్ గా సలార్ టాప్ పొజిషన్ లో నిలిచింది. మొత్తానికి అయితే సినీ వర్గాల్లో వచ్చిన అప్డేట్ ప్రకారం సలార్ ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ నే అందుకుంది అని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా జగపతిబాబు, పృథ్వీ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.