బాక్సాఫీస్.. వరల్డ్ వైడ్ ‘జైలర్’ టార్గెట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ చాలాకాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నారు. గతంలో ఆయన సినిమాలు దాదాపు అన్ని భాషల్లో కూడా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందించేవి. కానీ గత పదేళ్ల కాలంలో చూసుకుంటే ఏ సినిమా కూడా పూర్తిస్థాయిలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేయలేకపోయింది.

అయితే ఈసారి తప్పనిసరిగా జైలర్ సినిమాతో మాత్రం సూపర్ స్టార్ సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇక సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే ఈ సినిమా అత్యధికంగా తమిళనాడులో 60 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక తరువాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలుపుకుని 12 కోట్ల ధర పలికిన ఈ సినిమా కర్ణాటకలో దాదాపు 10 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక కేరళలో 5.5 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్లు ఓవర్సీస్ లో 32 కోట్లతో కలుపుకొని మొత్తంగా 122 కోట్లకు పైగానే థియేట్రికల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావలి అంటే తప్పనిసరిగా దాదాపు 245 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాపై ఇప్పటివరకు ఉన్న బజ్ ప్రకారమైతే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం హై రేంజ్ లో ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక కంటెంట్ మరింత క్లిక్ అయితే మాత్రం పోటీగా ఇతర సినిమాలు పోటీగా ఉన్నా కూడా జైలర్ మంచి ఆక్యుపెన్సీ ని నమోదు చేసుకునే అవకాశం ఉంది.