వండర్ ఉమెన్ ఇష్టపడిన భారతీయ వంటకం ఏంటో తెలుసా?

వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌, డ్వేన్‌ జాన్సన్, రేయాన్‌ రెనాల్డ్స్‌ కలిసి నటించిన ‘రెడ్‌ నోటీస్’ చిత్రం ఎంతో విజయవంతమై అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది. తన సినిమా విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్న గాల్ గాడోట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకెంతో ఇష్టమైన ఆహార పదార్థాల గురించి వెల్లడించారు. ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ చేసిన వీడియోలో తనకు వెల్లుల్లి నాన్ తో చేసిన బట్టర్ చికెన్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా మసాలా చికెన్ టిక్కా అంటే ఇష్టమని కూడా తెలియజేశారు.

అయితే వెల్లుల్లి నాన్ చికెన్ తినడానికి ఇష్టపడతానని ఆ చికెన్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అదేవిధంగా తనకు పెరుగు అన్నా చాలా ఇష్టం అని ఈ సందర్భంగా తనకు ఇష్టమైన భారతీయ వంటల గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ రాసన్‌ మార్షల్‌ థర్బర్‌ రచించి, దర్శకత్వం వహించిన ‘రెడ్‌ నోటీస్‌’ నవంబర్‌ 5న థియేటర్లో విడుదలయ్యింది.

థియేటర్ లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిందని చెప్పవచ్చు. నవంబర్ 5న థియేటర్ లో విడుదలైన ఈ సినిమా నవంబర్‌ 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయి ఓటీటీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇంతగా తమ సినిమాను ఆదరించినందుకు ఈ వండర్ ఉమెన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో గాల్ గడాట్ మోస్ట్ వాంటెడ్‌ ఆర్ట్‌ దొంగగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.