క్రేజీ : హాలీవుడ్ స్టార్ బ్యూటీకి అచ్చమైన తెలుగు నేర్పిస్తున్న అలియా.!

Headerimage_AliaBhatt_Instagram_63b276795b3ca

ఇప్పుడు ప్రపంచ సినిమా దగ్గర తెలుగు చిత్రానికి ఓ సుస్థిర స్థానం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా ఇందుకు ప్రధాన కారణం ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్ గా సెన్సేషనల్ చిత్రం “ఆర్ ఆర్ ఆర్” అనే చెప్పాలి. దర్శకుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ భారీ చిత్రం సెన్సేషనల్ రీచ్ తో ప్రకంపనలు సెట్ చేసింది.

ఇక ఇదిలా ఉండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంతోనే ఆలియా భట్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో తెలుగు మాట్లాడ్డం కోసం ఆ టైం లో ప్రత్యేక శిక్షణ కూడా ఆలియా భట్ తీసుకుంది.

తెలుగు కోసం ఓ మాస్టర్ ను కూడా పెట్టుకొని ఈ చిత్రంలో తెలుగు డైలాగ్స్ ని ఆమెనే చెప్పుకుంది. అయితే లేటెస్ట్ గా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో క్రేజీగా మారింది. హాలీవుడ్ భారీ చిత్రం “వండర్ విమెన్” హీరోయిన్ గల్ గడోట్ కి ఆలియా భట్ తెలుగు నేర్పిస్తున్న ఓ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.

మరి ఈ హాలీవుడ్ హీరోయిన్ సహా ఆలియా భట్ లు నటించిన హాలీవుడ్ చిత్రం “హార్ట్ ఆఫ్ స్టోన్” ఈ ఆగస్ట్ 11 రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఇందులో ఆలియా మాట్లాడిన రెండు ముక్కలు తెలుగు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉండగా దీనిని హాలీవుడ్ హీరోయిన్ మాట్లాడే ప్రయత్నం చేసింది.

దీనితో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ క్రేజీ వీడియో మన తెలుగు ఆడియెన్స్ లో వైరల్ గా మారింది. దీనితో తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.