ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు లేవు.. నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు!

సినీనటి పూనం కౌర్ ఎప్పుడూ ఏదో ఒక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమస్యలను ప్రశ్నించడంలో, వాటిని మీడియా ముందుకి తేవడంలో ఎప్పుడు ముందుండే పూనం మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. మహిళలు ఎవరూ సీఎం సమావేశానికి వెళ్లేంత ముఖ్యమేం కాదంటుంది పూనమ్ కౌర్.
అసలు ఏం జరిగిందంటే తెలంగాణలో పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలు,టికెట్ల రేట్ల పెంపు ఉండబోవని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సినీ పెద్దలు అందరూ ఆయనతో భేటీ కావడానికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే వెళ్లిన వారిలో ఒక మహిళ కూడా లేకపోవటం గమనార్హం ఇదే విషయాన్ని తనదైన శైలిలో స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవు కేవలం హీరోలకి బిజినెస్ గురించి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుందని ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

తాజా పరిస్థితిని చూస్తే ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు ఎలాంటి సమస్యలు లేవని అర్థమవుతుంది అంటూ వ్యంగ్యాస్త్రాన్ని సందించింది. మరి దీనిపై మీటింగ్ కు వెళ్లిన ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో, అసలు ఈ ట్వీట్ ని పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. ఇకపోతే ఇదే పూనం కౌర్ గత నాలుగు రోజుల కింద పుష్ప సినిమాపై కామెంట్స్ చేసింది. సినిమా చాలా బాగుంది, సమ్మక్క సారలమ్మ జాతర లాగా గంగమ్మ జాతర అని కూడా చాలా బాగా చూపించారు.

ఆచార సంస్కృతి సంప్రదాయాలను కూడా చాలా బాగా చూపించారు. ఈ సీన్ లో అల్లు అర్జున్ కంటే గొప్పగా ఎవరూ నటించలేరు అంటూ పోస్ట్ చేసింది. అయితే బన్నీ అభిమానులు ఈ పోస్ట్ కి ఆనంద పడిపోయి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరి కొంతమందేమో ఇప్పుడు బన్నీ అండ్ టీం సమస్యల సుడిగుండంలో ఉన్నారు, ఇలాంటి సమయంలో ఇలాంటి పోస్టులు అవసరమా అని ట్రోల్స్ చేస్తున్నారు.