Prabhas: హాలీవుడ్ లో నటించనున్న ప్రభాస్.. యూనివర్సల్ స్టూడియోస్ కు ఓకే చెప్పేస్తాడా,..?

Prabhas: బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇండియన్ సినిమాలలో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. రాధేశ్యాం సినిమా తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే వంటి బ్లాక్ బస్టర్ సినిమా నే కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. 2025 వరకు ప్రభాస్ సినిమాలతో బిజీ, వేరే ఏ ప్రాజెక్టుగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా యూనివర్శల్ స్టూడియోస్ వారు ప్రభాస్ ని  సంప్రదించినట్టు సమాచారం.

ఇప్పటికే రెండు సార్లు ప్రభాస్ తో ఈ సంస్థ చర్చలు జరిపాయని అంటున్నారు.ఓ సూపర్ హీరో ఫిల్మ్ ఫ్రాంచైజ్ కు ప్రభాస్ ని అడుగున్నట్లు వినికిడి. భారతదేశంలోనూ హాలీవుడ్ స్టూడియో లు నిర్మించే సూపర్ హీరో సినిమాలకు ఓ రేంజిలో మార్కెట్ ఉంది. దాంతో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ పై మరింత దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారత్ లోని హీరోని తమ ఫ్రాంచైజ్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అందుకోసం ప్రభాస్ భారీ ఎత్తున డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.ప్రభాస్ కు ఇందు నిమిత్తం భారీ రెమ్యునేషన్ ఆఫర్ ఉంది. ఈ సినిమా వర్కవుట్ అయితే ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతారనటంలో సందేహం లేదు.

బాహుబలి సిరీస్ తో భారీ విజయాలను అందుకున్న ప్రభాస్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి పరాజయాలను చూస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో కొన్ని పెద్ద ప్రాజెక్టు ఉన్న వాటితో పాటు మారుతీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలసినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కూడా చిన్న డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ప్రభాస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అభిమానులు కూడా గమనిస్తున్నారు.