హీరోయిన్‌గా ఓ ఛాన్స్ ఇవ్వరూ.!

మెగా డాటర్ నిహారిక మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటోందా.? అవుననే అంటున్నాయ్ సినీ వర్గాలు. మళ్లీ హీరోయిన్‌గా రాణించాలని నిహారిక ఆశపడుతోందట. ఈ మధ్య ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది నిహారిక.

యాక్టింగ్ చేయాలన్న కోరికతోనే అందుకు తన అత్తింటి వాళ్లు అభ్యంతరం చెప్పడంతో విడాకులను ఆశ్రయించిందన్న ప్రచారం కూడా లేకపోలేదు నిహారిక విషయంలో. ఇక, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలూ, యాక్టివ్‌గా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం.. గట్రా ఇవన్నీ మళ్లీ సినిమాల్లోకి రావడానికి సంకేతాలే అంటున్నారు.

అయితే, ఇప్పుడు నిహారికకు హీరోయిన్‌గా అవకాశాలు రావడం కష్టమే. ఏదో చిన్నా చితకా పాత్రలు తప్ప.. హీరోయిన్ అవకాశాలు రావడమనేది ప్రశ్నార్ధకంగానే వుంది.

అయితే, చిన్న చిన్న అవకాశాలు కాదు, కేవలం హీరోయిన్ అవకాశాలే కావాలంటోందట నిహారిక. నిజానికి మెగా డాటర్ తలచుకుంటే అదేమంత కష్టం కాదు కానీ, నిహారికకు హీరోయిన్ ఛాన్సులు రావడం లేదెందుకబ్బా.! ఇది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే సుమా.!