ఇలా అయితే “ఆనిమల్” లాగుతుందా??

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఒకటే అయ్యింది. బాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ కోసం తెలుగు హీరోలు హిందీ మార్కెట్ కోసం చాలా చేస్తున్నారు. అయితే తెలుగులో చాలా మంది హీరోస్ ఆల్రెడీ బాలీవుడ్ లో మంచి మార్క్ ని సెట్ చేసుకోగా ఇప్పుడు తెలుగు మార్కెట్ కోసం ఓ బాలీవుడ్ యంగ్ హీరో బాగా కష్టపడుతున్నాడు.

మరి ఆ హీరోనే సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కాగా తాను నటించిన లేటెస్ట్ చిత్రమే “ఆనిమల్”. తెలుగు దర్శకుడు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ తెరకెక్కించిన ఈ సినిమాపై సెన్సేషనల్ హైప్ ఉంది. అయితే ఈ సినిమా భారీ మొత్తంలో 3 గంటల 21 నిముషాలు అనేసరికి చాలా మంది కంగారు పడ్డారు కానీ మేకర్స్ మాత్రం ప్రతి ఫ్రేమ్ సినిమాలో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు.

కాగా ఇదిలా ఉండగా సరే మూడు గంటలు దాటి అయినా కూడా సినిమాలో క్రేజీ ఏక్షన్ సీన్స్ ఉన్నట్టు ఉన్నాయి అలాగైనా లాగేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఏఈ మూడు గంటల 20 నిమిషాల సినిమాలో కేవలం అంటే కేవలం అరగంట మాత్రమే ఏక్షన్ సీన్స్ ఉంటాయని నిర్మాత రివీల్ చేసాడు.

ఇది షాకింగ్ అని చెప్పాలి. ఎక్కువ శాతం డ్రామా ఎమోషన్స్ మాత్రమే సినిమాలో ఉంటాయని చెప్తున్నాడు. మరి వీటితోనే అంతసేపు సినిమా అంటే కాస్త ఆలోచించాలి మరి. కాకపోతే అక్కడ సందీప్ రెడ్డి వంగ బ్రాండ్ ఉంది కాబట్టి ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. మరి ఈ మూడు గంటల జర్నీ ఎలా ఉంటుందో చూడాలంటే ఈ డిసెంబర్ 1 వరకు ఆగక తప్పదు.