చాలాకాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా ‘బద్రినాథ్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో అది చాలా పెద్ద డిజాస్టర్.! మళ్ళీ అలాంటి ప్రయత్నం అల్లు అర్జున్ చేయలేదు, చేయడానికే భయపడుతున్నాడు కూడా.!
అయితే, తాజాగా అలాంటి కథాంశంతోనే పూర్తి డివోషనల్ టచ్‌తో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాలని ఓ యంగ్ డైరెక్టర్ ప్రయత్నిస్తున్నాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ విషయమై అల్లు అర్జున్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇప్పుడంతా డివోషనల్ టచ్ వున్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘హనుమాన్’ రిజల్ట్ ఫలితమే ఇది.! చారిత్రక నేపథ్యం, డివోషనల్ టచ్.. ఇలాంటి ప్రాజెక్టులకి క్రేజ్ పెరిగింది. దాంతో, అల్లు అర్జున్ ఈసారి కాస్త రిస్క్ తీసుకునే అవకాశాల్లేకపోలేదు.
ప్రస్తుతానికైతే ‘పుష్ప-2’ సినిమా పనుల్లో అల్లు అర్జున్ చాలా చాలా బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోయే రెండు మూడు సినిమాలకు ఒప్పందాలూ జరిగిపోయాయ్.
ఏమో, ఏమైనా జరగొచ్చు.. ట్రెండ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటే, అల్లు అర్జున్ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు. ఎవరా యంగ్ డైరెక్టర్.? ఏంటా నిర్మాణ సంస్థ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.