ఇంత అందం పెట్టుకొని హీరోయిన్ గా ఎందుకు సక్సస్ కాలేకపోయిందంటే..?

Poonam Bhajwa

పూనమ్ బజ్వా, ఇప్పుడున్న ఏ స్టార్ హీరోయిన్ కు తగ్గని అందం. ఏ స్టార్ హీరోతోనైనా జోడి కట్టగల ఎత్తు. చలాకీగా కనిపించే కళ్ళు, చక్కటి ముక్కు అంతకు మించి రంగు. అయినా కూడా తెలుగులో హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఎంతోమంది కుర్రకారు పూనమ్ బజ్వా ఫోటోలను తమ డెస్క్ టాప్ వాల్ పేపర్లుగా పెట్టుకున్నారు, కానీ అతి తక్కువ కాలంలో హీరోయిన్ గా తెలుగులో ఫేడ్ అవుట్ అయిపోయింది.

Poonam Bhajwa

పూనమ్ బజ్వా ఎందుకు సక్సస్ కాలేదు అని చూస్తే, తాను ఎన్నుకున్న సినిమాలే కారణం. ఇరవై ఏళ్లకే మిస్ పూణే గా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన పూనమ్ బజ్వా తరుణ్ హీరోగా వచ్చిన ‘మొదటి సినిమా’ లో హీరోయిన్ గా వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయిందో కూడా తెలియదు.

తన రెండో సినిమా నవదీప్ తో ప్రేమంటే ఇదే అనే సినిమాలో చేయగా అది కూడా భారీ ప్లాప్ అయ్యింది. అయితే తనకు వచ్చిన మూడో అవకాశం పెద్ద హీరో నాగార్జున తో బాస్ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాలో దర్శకుడు తన పాత్రను తీర్చిదిద్దిన తీరుతో పూనమ్ బజ్వాకు చాల నెగటివ్ అయ్యింది.

Poonam Bhajwa

ఇక నాల్గొవ సినిమాగా ఆనంద్ ఫేమ్ హీరో రాజా తో చేసిన వేడుక.ఈ సినిమా ఫలితం కూడా మొదటి మూఢు చిత్రాలకు భిన్నంగా ఏమి రాలేదు. అయితే బాగా గమనిస్తే పూనమ్ బజ్వా కేవలం తన కథలు ఎంపిక, లేదా దర్శకులు తన పాత్రను మలిచిన తీరు వల్ల తెలుగు వారిని ఎక్కువ కాలం అలరించలేకపోయింది.

అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హీరో నాగార్జున తప్ప తనతో నటించిన మిగతా ముగ్గురు హీరోలు తరుణ్, రాజా , నవదీప్ లు కూడా ఆ తర్వాత ఎక్కువ కాలం హీరోలుగా ఇండస్ట్రీలో నిలవలేదు.

తెలుగు లో రాణించలేకపోయిన తమిళ్ , మలయాళం మరియు కన్నడ రంగాల్లో పర్వాలే అనిపించేవిధంగా రాణించింది . తనని మిస్ అవుతున్న తెలుగు వారికి సోషల్ మీడియాలో క్రమం తప్పకుండ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

Poonam Bhajwa