సోదరి ముందే అందాల ఆరబోతే.. పూనమ్ పిక్స్ వైరల్

Poonam Bajwa Latest pics Goes viral

పూనమ్ బజ్వా తెలుగులో ఇప్పుడు అంతగా వినిపించని పేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం మార్మోగే పేరు. ఆ మధ్య బిగ్ బాస్ నాల్గో సీజన్ ప్రారంభం కాకముందు నిత్యం వార్తల్లో నిలిచేది. తెలుగు బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో పూనమ్ బజ్వా వస్తుందని రూమర్లు వినిపించాయి.చివరకు అది నిజంగానే రూమర్‌గా మిగిలింది. మళ్లీ తమిళ నాల్గో సీజన్ ప్రారంభ సమయంలోనూ అలాంటి వార్తలే వచ్చాయి.

Poonam Bajwa Latest pics Goes viral
Poonam Bajwa Latest pics Goes viral

అలా పూనమ్ బజ్వా వచ్చే రూమర్లతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా ఇప్పటికీ అందరూ గుర్తు పెట్టుకున్నారు. మొదటి సినిమా, పరుగు వంటి చిత్రాలతో పూనమ్ బాగానే క్లిక్ అయింది. అయితే ఆ మధ్య పూనమ్ తన ప్రేమికుడిని పరిచయం చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి నెట్టింట్లో మంట పుట్టించేసింది.

సునీల్‌ రెడ్డి.. మై రూట్స్‌, గ్రౌండ్‌, వింగ్స్‌. హ్యాండ్సమ్‌, అందమైన హృదయం ఉన్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో ప్రేమ, ఫన్‌, సంతోషం, ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మాటల్లో చెప్పలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా పూనమ్ మాత్రం తన సోదరి ఎదుటే అందాలను ఆరబోసింది. ఇందులో పూనమ్ తన నాభి అందాలను ప్రదర్శించింది. ఈ ఫోటోలను తన సోదరి క్లిక్‌మనిపించిందని చెప్పుకొచ్చింది.