ఊపిరాడనంత బిజీగా ఉన్నా కీర్తి సురేష్ ఆ సినిమాలో ఆఫర్ కోసం ఎందుకు ఎదురుచూస్తుంది ..?

కీర్తి సురేష్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో మహానటి సినిమా తర్వాత ఊహించని క్రేజ్ ని సంపాదించుకుంది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. కీర్తిని బాగా పాపులర్ చేశాయి. ఇప్పటికే కీర్తి సురేష్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెల్సిందే. అయితే ఒక భారీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఆశగా ఉందట. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

ప్రభాస్ హీరోగా నటించనున్న ఆదిపురుష్ 3డి సినిమా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో పెద్ద సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా.. సైఫ్ అలీఖాన్ లంకేష్ గా నటించబోతున్నారు. ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆదిపురుష్ 3డి లో సీత పాత్ర కి మేకర్స్ ఎవరిని ఎంచుకోబోతున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖంగా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న కీర్తి సురేష్, కియరా అద్వాణీ సీత పాత్రలో నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

కాగా ప్రభాస్ పక్కన సీతగా కీర్తి సురేష్ అన్న న్యూస్ చాలామందికి కొత్తగా అనిపించింది. అంతేకాదు కీర్తి ఫ్యాన్స్ కి ఈ న్యూస్ చాలా ఉత్సాహాన్నిచ్చింది. అంచనాలు కూడా బాగానే పెంచుకున్నారు. కీర్తి సురేష్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్ మీద బాగానే ఆశలు పెట్టుకుందని సమాచారం. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అంటే ఇలాంటిదే అని.. ఇలాంటి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోతుందని భావిస్తుందట. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న కీర్తి కి ఆది పురుష్ లో అవకాశం వస్తుందా లేదా అన్నది ప్రభాస్ బర్త్ డే వరకు ఆగితే గాని తెలియదు.

ఇక ప్రస్తుతం కీర్తి చేతిలో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, అన్నాత్తే, రంగ్ దే సినిమాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట లో నటించబోతుంది. ఈ సినిమాలే కాకుండా మరికొన్ని తెలుగు, తమిళ సినిమాలలో డేట్స్ కోసం మేకర్స్ కీర్తి ని సంప్రదిస్తున్నారట. ఇన్ని ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని కూడా కీర్తి ఆదిపురుష్ కోసం ఆలోచిస్తుందంటే ఆ సినిమా మీద ఎంతగా ఆసక్తి చూపిస్తుందో అర్థం అవుతోంది.