Varalakshmi Sharath Kumar:చెన్నై ను వదిలి హైదరాబాద్ వచ్చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. కారణం అదేనా?

Varalakshmi Sharath Kumar:సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ మొదట హీరోయిన్ గా చేసిన,ప్రస్తుతం విలక్షణమైన పాత్రలతో తన సత్తా చాటుకుంది. విలక్షణమైన పాత్రలకు కానీ ఫిమేల్ విలన్ గా కానీ ప్రస్తుతం వినిపిస్తున్న పేరు వరలక్ష్మి. ఇటీవల గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర పోషించారు. ఈ పాత్రకు వరలక్ష్మి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా విలక్షణమైన పాత్రలో వరలక్ష్మీ నటించనున్నారు. ఇంకా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నరట వరలక్ష్మి.

ఇలా వరుస తెలుగు సినిమాలు చేస్తూ,వరలక్ష్మి శరత్ కుమార్ తన నివాసాన్ని చెన్నై నుంచి హైదరాబాద్ కి మార్చేసినట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఇక నుండి తన పూర్తి కెరీర్ని ఇక్కడి నుంచే కొనసాగిస్తాను అని ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ఖరీదైన ఏరియాలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్న వరలక్ష్మి, త్వరలోనే ఇండిపెండెంట్ హౌస్ కి కూడా మారుతారుఅట.

అయితే వరలక్ష్మి చెన్నై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చడం పై టాలీవుడ్ లో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి.సడెన్ గా అమ్మడు చెన్నై వదిలి రావడానికి కారణం ఏంటీ అనేది హాట్ టాపిక్ గా మారింది. వరూకు శరత్ కుమార్ కి మధ్య విభేదాలా.. అంటే అలాంటివేమీ లేవంటున్నారు కోలీవుడ్ వర్గాలు.తండ్రి రెండో పెళ్లి చేసుకున్న రాధికా తో కూడా వరలక్ష్మీ సన్నిహితంగానే ఉంటుంది.  మరి విబేధాలు ఏమీ లేకుండా హైదరాబాద్ కి మకాం మార్చటం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు రావడం.. షూటింగ్ కోసం ప్రతిసారి చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడం ఇబ్బందిగా మారిందని, అందుకే మొత్తానికే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు..