సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఎదుర్కొంటోంది మెగా డాటర్ నిహారిక. పబ్‌లో పట్టుబడిన దగ్గర్నుంచీ భర్తతో విడాకుల అంశం వరకూ ఏదో ఒక రకంగా ఆమెను టార్గెట్ చేస్తూనే వున్నారు నెట్టింట. ఇంత రచ్చ జరుగుతుంటే, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత నెగిటివిటీని ఎట్రాక్ట్ చేస్తోంది నిహారిక.
అసలీ నెగిటివ్ పబ్లిసిటీని నిహారిక ఎందుకు ఖండించడం లేదు.? అంటే అందుకూ ఓ రీజన్ వుంది. తాజాగా ‘డెడ్ పిక్‌సెల్స్’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నిహారిక నటించింది. త్వరలోనే ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్‌కి ఫ్రీ పబ్లిసిటీగానే ఈ నెగిటివిటీని నిహారిక ఎంటర్‌టైన్ చేస్తోంది.. అంటున్నారు. అంతేకదా.. ఆల్రెడీ వచ్చిన నెగిటివిటీని ఎలాగూ ఆపలేదు. సో, ఇలా తన వెబ్ సిరీస్ ప్రమోషన్‌కి అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చన్న నిర్ణయానికి నిహారిక వచ్చేసినట్లు తెలుస్తోంది.
అది సరే, అసలింతకీ నిహారిక వైవాహిక జీవితం ఎలా వుంది.? భర్తతో కలిసే వుందా.? విడిపోయిందా.? ఈ విషయాల్లోనూ ఖచ్చితమైన క్లారిటీ రావాల్సి వుంది.