సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సుకుమార్ గత చిత్రం పాన్ ఇండియన్ రేంజ్ హిట్ అందుకోవడంతో ఈ సారి ఏకంగా పాన్ ఇండియన్ సినిమానే తెరకెక్కిస్తున్నాడు.
ఇక టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో పాన్ ఇండియన్ సినిమాగా ఫైటర్ తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
కాగా విజయ్ దేవరకొండ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటించే సినిమాని అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఊహించని ఈ కాంబినేషన్ మీద ఇప్పుడు అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు మొదలయ్యాయి. అంచనాలతో పాటు రక రకాల రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఇదే అంటూ.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఆ బ్యూటీనే అంటూ వార్తలు వస్తున్నాయి.
అలాగే తాజాగా ఈ సినిమాకి సుకుమార్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ గురిచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ కి నిర్మాత కేదార్ సెలగంశెట్టి 10 కోట్ల అడ్వాన్స్ ని ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాత విజయ్ దేవరకొండ స్నేహితుడు కావడం తో సుకుమార్ రెమ్యూనరేషన్ ని విజయ్ ఫిక్స్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదంతా కేవలం పుకారేనని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఈ కాంబినేషన్ లో సినిమా 2022 రిలీజ్ అవుతుందని సమాచారం.