బాలీవుడ్ సినిమాలకు చైతూ నో చెప్పడానికి కారణం?

టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే సినిమా ద్వారా నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి ఈ క్రమంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో పాటు అమీర్ ఖాన్, చిరంజీవి కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో నాగచైతన్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇప్పటివరకు తాను బాలీవుడ్ లో సినిమా చేయకపోవడానికి గల కారణం గురించి కూడా ఈ సందర్భంలో వెల్లడించాడు. ఈ క్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తనకి బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని కాకపోతే తాను వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. నేను చెన్నైలో పుట్టి, పెరిగి హైదరాబాదులో ఉంటున్నాను. . హింది విషయం లో నేను పర్ఫెక్ట్ కాదు. అందువల్ల ఈ విషయంలో నాకు నా మీద నాకు నమ్మకం లేదు. అందువల్ల హిందీలో వస్తున్న ఆఫర్స్ అన్ని రిజెక్ట్ చేశానని నాగచైతన్య వెల్లడించారు. అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా కి కూడా మొదట నో చెప్పానని , కథానుసారంగా ఈ సినిమాలో నేను సౌత్ నుండి నార్త్ వెళ్ళిన కుర్రాడి పాత్రలో కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ బోడి బాలరాజు గా కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన నాగచైతన్య థాంక్యూ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆగష్టు 11 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న లాల్ సింగ్ చడ్డా సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.