బేబీ కోసం యూత్ ఎందుకలా ఎగబడుతున్నారు?

సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన మూవీ బేబీ. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్ లో నటించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత కల్ట్ లవ్ స్టొరీని చూసామనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో యూత్ ఆడియన్స్ నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకున్న మూవీ అంటే బేబీ అని చెప్పాలి. ముఖ్యంగా ఫిమేల్ సెంట్రిక్ గా ఈ కథని దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించి, ప్రేమకథలోని భావోద్వేగాలు ఆవిష్కరించారు. మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఎవెన్ అందుకుంది. వీకెండ్ పూర్తయిన తర్వాత కూడా కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మూవీకి ఆదరణ రావడానికి కారణం ఏంటి అనేది అర్ధం కాక సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా థియేటర్స్ దగ్గర యూత్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో బోనాల కారణంగా విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చారు. దీంతో సోమవారం థియేటర్స్ చాలా వరకు హౌస్ ఫుల్ పడ్డాయి. ఇక ఏపీలో కూడా యూత్ ఆడియన్స్ అయితే కాలేజీ కి బంకు కొట్టి ఈ సినిమా చూడటానికి వస్తున్నారంట.

ప్రేమకథని ఇష్టపడే ప్రతి ఒక్కరు బేబీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారంట. ఈ రోజుల్లో చాలా వరకు యూత్ లో కూడా ఈ తరహా ఘటనల గురించి రెగ్యులర్ గా చర్చించుకునేవే. ఈ కారణంగానే కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వారం పాటు యూత్ నుంచి బేబీ సినిమాకి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సినిమాని ఎస్కేఎన్ పది కోట్లతో నిర్మించారు. డిజిటల్ రైట్స్ ద్వారానే 7.5 కోట్లు వచ్చేశాయి. ఇక మిగిలిన బ్రేక్ ఎవెన్ కూడా మూడు రోజుల్లో కలెక్ట్ అయిపొయింది.

దీంతో కచ్చితంగా చిన్న సినిమాలలో పెద్ద హిట్ అవ్వడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించిన మొదటి మూవీ బలగం, తరువాత గత నెలలో రిలీజ్ అయిన శ్రీవిష్ణు మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని 40 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు బేబీ కూడా ఆ ఫీట్ అందుకునే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.