సడెన్ గా “ఆదిపురుష్” పై ఇంత ప్రేమ ఏంటి??

ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తున్నా సినిమా “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కించగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ అయితే ఈ సినిమాని తెరకెక్కించాడు.

అలాగే ఈ భారీ చిత్రంపై ఇప్పుడు అంతకంతకు అంచనాలు పెరుగుతూ వస్తుండగా ఈ సినిమాపై సడెన్ గా కొన్ని కాంట్రవర్సీలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే వీటితో పాటుగా మరికొందరు సినీ ప్రముఖులు ఐతే ఏకంగా పది వేల టికెట్స్ ని కొందరికి కేటాయించి తామే స్పెషల్ షో లు వేస్తామని చెప్తున్నారు.

మరి మొన్ననే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10 వేల టికెట్స్ ని ఇస్తుండగా నిన్ననే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఇదే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలిపాడు. దీనితో ఇలా సడెన్ గా సినీ ప్రముఖులకు ఎందుకు ఆదిపురుష్ పట్ల ఇంత ప్రేమ వచ్చేసిందా అని అంతా అనుకుంటున్నారు.

నిజంగానే పేద ప్రజలపై ప్రేమతో ఇస్తున్నారా లేక ఇందుకు వేరే కారణం ఏమన్నా ఉందా అని అనుకుంటున్నారు. దీనితో ఆదిపురుష్ విషయంలో ఈ ఇంట్రెస్టింగ్ మూవ్ సినీ వర్గాల్లో అయితే వైరల్ గా మారింది. ఇక కృతి సనన్, సైఫ్ అలీఖాన్, అలాగే సన్నీ సింగ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ఈ జూన్ 16న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.