సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ తెలుగులో ఏకంగా 300 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషలలో కూడా సినిమాలు చేశారు.పండంటి కాపురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తన తదుపరిచిత్రం సోగ్గాడు సినిమాలో మెయిన్ పాత్ర పోషించే ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా ఈమె సినీ కెరియర్ అద్భుతంగా కొనసాగుతున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయని చెప్పాలి.మనం జయసుధ భర్త నితిన్ కపూర్ అని భావిస్తాము అయితే ఈమెకు నితిన్ కపూర్ రెండవ భర్త అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే జయసుధ మొదటి భర్త ఎవరు ఆమె ఎందుకు మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు అనే విషయానికి వస్తే..
జయసుధ నితిన్ కపూర్ కన్నా ముందు వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ పెళ్లి చేసుకున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. ఇక జయసుధ మొదటి భర్త ఎవరు అనే విషయానికి వస్తే ఆయన పేరు కాకర్లమూడి రాజేంద్రప్రసాద్.ఈయన ఓ వ్యాపారవేత్త ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో జయసుధ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు. ఇక చేసేదేమి లేక పెద్దలు కూడా వీరు పెళ్లికి అంగీకరించారు. తిరిగి వీరిద్దరి వివాహం ఎంతో ఘనంగా చేయడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా వివాహానికి హాజరయ్యారు.
ఇక పెళ్లయిన తర్వాత జయసుధ సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈయన వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవారు అయితే వీరిద్దరూ ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో అంతే తొందరగా విడాకులు తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ వ్యక్తిగతంగా జయసుధను బాగా టార్చర్ చేయడంతో ఆమె అతని టార్చర్ భరించలేక కొద్ది రోజులపాటు చెన్నైలోనే విజయవాహిని స్టూడియోలో తల దాచుకున్నారట. ఈ విధంగా వీరిద్దరి కాకర్లమూడి రాజేంద్రప్రసాద్ బాగా టార్చర్ చేయడంతోనే ఈమె విడాకులు ఇచ్చారని అనంతరం నితిన్ కపూర్ నీ పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.