తారకరత్న చికిత్స ఖర్చు ఎవరు బరిస్తున్నారు?

గుండెపోటు, బ్రెయిన్ డెడ్ కు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయలో ఇంకా వైద్య చికిత్సలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు వైద్యం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోందని సమాచారం.

తారకరత్నకు ఇప్పటికే అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన బ్రెయిన్ డెడ్ రికవరీ చేయడానికి మెదడుకు సంబంధించిన మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం, ఇతర అవయవాలు బాగానే ఉన్నాయని, వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తారకరత్న చికిత్సకు ఖర్చులు ఎవరు భరిస్తున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నియాంసమైంది. అందులో ఉన్న సమాచారం ప్రకారం తారకరత్నకు చికిత్సకు సంబంధించిన పూర్తి ఖర్చులను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరిస్తున్నారట. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో.. ఆ ఖర్చులను తానే భరిస్తానని చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారట.

ఈ విషయం తారకరత్న సతీమణికి కూడా చెప్పి హామీ ఇచ్చారట.అయితే నందమూరి కుటుంబంలో ఇతరులతో పోల్చితే తారకరత్న ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని సమాచారం. అందుకే తారకరత్న చికిత్సకు అయ్యే భారీ ఖర్చును తానే చెల్లిస్తానని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

కాగా, ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు నందమూరి తారకరత్న. అయితే ఆయన నటుడిగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం రాజకీయ పరంగా ఎదగాలని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా కార్డియక్ అరెస్ట్ కు గురయ్యారు. దీంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని నందమూరి అభిమానులు, ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆకాంక్షిస్తున్నారు.